టివి తెచ్చిన తంటా…తండ్రిని రోకలి బండ కొట్టి చంపిన కుమారుడు

  నల్లగొండ: చానల్ మార్చొద్దన్నందుకు తండ్రిని చంపిన కుమారుడు సంఘటన నల్లగొండ జిల్లా ప్రకాశం బజారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నాంపల్లి మండలానికి చెందిన పెరుమాళ్ల గోవర్థన్ ప్రకాశం బజార్‌లోని అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతడి కొడుకు సతీష్ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. గోవర్థన్ భక్తి చానల్ చూస్తూ కుమారుడిని జీతం డబ్బులు అడిగాడు. సతీష్ టివి చానల్ మారుస్తుండగా తండ్రి వద్దని గట్టిగా అరిచాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. […] The post టివి తెచ్చిన తంటా… తండ్రిని రోకలి బండ కొట్టి చంపిన కుమారుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నల్లగొండ: చానల్ మార్చొద్దన్నందుకు తండ్రిని చంపిన కుమారుడు సంఘటన నల్లగొండ జిల్లా ప్రకాశం బజారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నాంపల్లి మండలానికి చెందిన పెరుమాళ్ల గోవర్థన్ ప్రకాశం బజార్‌లోని అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతడి కొడుకు సతీష్ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. గోవర్థన్ భక్తి చానల్ చూస్తూ కుమారుడిని జీతం డబ్బులు అడిగాడు. సతీష్ టివి చానల్ మారుస్తుండగా తండ్రి వద్దని గట్టిగా అరిచాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. అనంతరం కోపంలో ఊగిపోయిన సతీష్ రోకలి బండ తెచ్చి టివి పగులగొట్టాడు. అనంతరం తండ్రి తలపై రోకలి బండతో కొట్టాడు. ఘటనా స్థలంలో గోవర్థన్ చనిపోయాడు. కూతురు ఫిర్యాదు మేరకు సిఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 సంవత్సరాల క్రితమే గోవర్థన్ భార్య కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 

Son Killed Father about TV Remote Issue in Nalgonda

The post టివి తెచ్చిన తంటా… తండ్రిని రోకలి బండ కొట్టి చంపిన కుమారుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: