ఆ కారణంతోనే రేస్‌లో వెనకబడిపోతోంది

  మలయాళం బ్యూటీ సాయి పల్లవి టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఆమెలో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు కానీ హీరోయిన్‌కి ఉండాల్సిన గ్లామర్ అప్పీల్ లేకున్నా అందరినీ మాయ చేసేస్తుంటుంది. సమ్‌థింగ్ డిఫరెంట్ అట్రాక్షన్ సాయి పల్లవిలో దాగుంది. అంతేకాదు తన పక్కన నటించే ఏ హీరోనైనా సాయి పల్లవి సులభంగా డామినేట్ చేసేస్తుందనే టాక్ కూడా ఉంది. అది ఆమె యాక్టింగ్ టాలెంట్ గొప్పతనం. అప్పియరెన్స్‌లోని మాయా జాలం. ఇవే ఆమెకు ప్లస్ పాయింట్స్. […] The post ఆ కారణంతోనే రేస్‌లో వెనకబడిపోతోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మలయాళం బ్యూటీ సాయి పల్లవి టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఆమెలో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు కానీ హీరోయిన్‌కి ఉండాల్సిన గ్లామర్ అప్పీల్ లేకున్నా అందరినీ మాయ చేసేస్తుంటుంది. సమ్‌థింగ్ డిఫరెంట్ అట్రాక్షన్ సాయి పల్లవిలో దాగుంది. అంతేకాదు తన పక్కన నటించే ఏ హీరోనైనా సాయి పల్లవి సులభంగా డామినేట్ చేసేస్తుందనే టాక్ కూడా ఉంది. అది ఆమె యాక్టింగ్ టాలెంట్ గొప్పతనం. అప్పియరెన్స్‌లోని మాయా జాలం. ఇవే ఆమెకు ప్లస్ పాయింట్స్. అలాగే అవే ఆమె కెరీర్‌కి మైనస్ పాయింట్స్ కూడా. ఎప్పుడో స్టార్ హీరోయిన్స్ రేంజ్‌ని అందుకోగల సత్తా సాయిపల్లవిలో ఉన్నప్పటికీ ఈ కారణంతోనే రేస్‌లో వెనకబడిపోతోంది. చిన్న హీరోలకు ఆప్షన్‌గా మాత్రమే మిగిలిపోతోంది. గతంలో హీరో నాగశౌర్య… సాయిపల్లవి వైఖరిపై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఆ మాటకొస్తే సాయి పల్లవి ఏ సినిమాలో నటించినా ఇలాంటి విమర్శలు వినాల్సి వస్తుంది. తాజాగా ఆమె నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ విషయంలోనూ ఇలాంటి విమర్శలే ఆమెను వెంటాడుతున్నాయట. నాగచైతన్య కూడా సాయిపల్లవి డామినేషన్‌ని తట్టుకోలేక తెర వెనుక విమర్శలు చేస్తున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ గుసగుసల్లో నిజమెంతో కానీ సాయిపల్లవి మాత్రం అలాంటి అమ్మాయి కాదంటూ ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల వెనకేసుకొస్తున్నాడట. నిజానికి సాయి పల్లవిది అలాంటి మనస్తత్వం కాదని ఆమె సన్నిహితులు కూడా చెబుతుంటారు.

 

Something different attraction lies in Sai pallavi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆ కారణంతోనే రేస్‌లో వెనకబడిపోతోంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: