చప్పట్లతో వైద్యులకు జేజేలు

  కరోనా బాధితులకు రాత్రి, పగలు సేవలందిస్తున్న వైద్యులకు సినీ ప్రముఖులు చప్పట్లతో జేజేలు పలికారు. జనతా కర్ఫూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు పలువురు సినీ స్టార్లు కుటుంబంతో సహా ఇంటి బయటకు చప్పట్లు కొట్టారు. చిరంజీవి కుటుంబం, అల్లు అరవింద్, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, మోహన్‌బాబు కుటుంబ సభ్యులు, రామ్‌చరణ్, ఉపాసన, ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్, ఛార్మి, రాశీఖన్నా, రణవీర్ సింగ్, దీపికా పదుకునే, పూజా హెగ్డే, తమన్నా తదతరులు చప్పట్లు […] The post చప్పట్లతో వైద్యులకు జేజేలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరోనా బాధితులకు రాత్రి, పగలు సేవలందిస్తున్న వైద్యులకు సినీ ప్రముఖులు చప్పట్లతో జేజేలు పలికారు. జనతా కర్ఫూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు పలువురు సినీ స్టార్లు కుటుంబంతో సహా ఇంటి బయటకు చప్పట్లు కొట్టారు. చిరంజీవి కుటుంబం, అల్లు అరవింద్, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, మోహన్‌బాబు కుటుంబ సభ్యులు, రామ్‌చరణ్, ఉపాసన, ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్, ఛార్మి, రాశీఖన్నా, రణవీర్ సింగ్, దీపికా పదుకునే, పూజా హెగ్డే, తమన్నా తదతరులు చప్పట్లు కొట్టి వైద్యుల సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు సినీ స్టార్లు కరోనాతో పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, మీడియా, పోలీసులకు సెల్యూట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. అదేవిధంగా చప్పట్లు కొడుతున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 

Solidarity for Doctors with Applause

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చప్పట్లతో వైద్యులకు జేజేలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: