సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎండి ఆత్మహత్య

హైదరాబాద్ : తనతో పెళ్లికి ప్రియురాలు నిరాకరించిందన్న కారణంతో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎండి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీర్ పేటలో బుధవారం జరిగింది. హైదరాబాద్ లోని నాచారం ప్రాంతానికి చెందిన నిఖిల్ రెడ్డి (27) అనే యువకడు శ్రీ సాయితి టెక్‌ మల్టీనేషనల్‌ కంపెనీలో ఎండిగా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేసే యువతిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను నిఖిల్ కోరాడు. పెళ్లికి సదరు యువతి నిరాకరించింది. […] The post సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎండి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : తనతో పెళ్లికి ప్రియురాలు నిరాకరించిందన్న కారణంతో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎండి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీర్ పేటలో బుధవారం జరిగింది. హైదరాబాద్ లోని నాచారం ప్రాంతానికి చెందిన నిఖిల్ రెడ్డి (27) అనే యువకడు శ్రీ సాయితి టెక్‌ మల్టీనేషనల్‌ కంపెనీలో ఎండిగా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేసే యువతిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను నిఖిల్ కోరాడు. పెళ్లికి సదరు యువతి నిరాకరించింది. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న నిఖిల్ రెడ్డి ఆఫీసులోనే చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని బుధవారం ఉదయం గుర్తించిన ఆఫీసు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం కోసం నిఖిల్ రెడ్డి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Software Company MD Commits Suicide In Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎండి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: