సోషల్‌మీడియా ద్వారా ప్రభుత్వ పథకాలను విస్తృతపర్చాలి

రాబోయే ఎన్నికల్లో సోషల్‌మీడియాదే కీలకపాత్ర ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి నియోజకవర్గ సోషల్‌మీడియా శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి  మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ : రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి సోషల్‌ మీడియా ద్వారా విస్తృత పర్చాలని ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా  కేంద్రంలోని లహరిగార్డెన్‌లో నియోజకవర్గంలోని సుమారు 2వేలమంది కార్యకర్తలకు సోషల్‌మీడియాపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి,  ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిలు మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం  చేపట్టని విధంగా కెసిఆర్ సారథ్యంలోని […]

రాబోయే ఎన్నికల్లో సోషల్‌మీడియాదే కీలకపాత్ర
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి
నియోజకవర్గ సోషల్‌మీడియా శిక్షణ శిబిరంలో ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి 

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ : రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి సోషల్‌ మీడియా ద్వారా విస్తృత పర్చాలని ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా  కేంద్రంలోని లహరిగార్డెన్‌లో నియోజకవర్గంలోని సుమారు 2వేలమంది కార్యకర్తలకు సోషల్‌మీడియాపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మర్రిజనార్దన్‌రెడ్డి,  ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిలు మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం  చేపట్టని విధంగా కెసిఆర్ సారథ్యంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనే క సంక్షేమ అభివృద్ధి పథకాలతోపాటు భారీ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేవిధంగా పథకాలను రూపొందించి విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్న ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

పింఛన్లతోపాటు షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ, గురుకుల పాఠశాలలు, రైతులకు రైతుబందు పథకం, 24గంటల ఉచితవిద్యుత్, ఉచితంగా వైద్యం , కెసిఆర్ కిట్టుతోపాటు అనేక పథకాలను ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఇన్ని పను లు చేస్తున్న ప్రతిపక్షాలు తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామో అనే భయంతో ఆరోపణలు చేస్తున్నారని సోషల్‌మీడియాలో తప్పుడూ ప్రచారాన్ని చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చేస్తున్న కుట్రలను ఎదుర్కొవడానికే టిఆర్‌ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి వారి కుట్రలను సోషల్‌మీడియా ద్వారా తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. నేడు సమాజంలో సోషల్‌మీడియాదే కీలకపాత్ర అని క్షణాల్లో ప్రపంచం మొత్తానికి సమాచారాన్ని చేరవేస్తున్నది సోషల్‌మీడియాదే అన్నారు. రాబోయే ఎన్నికల్లో సోషల్‌మీడియాదే విస్తృతంగా వినియోగించుకొని టిఆర్‌ఎస్ జెండాను రెపరెపలాడించడమే లక్షంగా సోషల్‌మీడియా సభ్యులు ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణలో సబ్బండ వర్గాలు సుఖసంతోషాలతో ఉండాలని మన ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక పథకాలకు శ్రీకారం చుట్టి ఎంతో పారదర్శకంగా ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ సోషల్‌మీడియాను అన్ని విధాలుగా వినియోగించుకునేలా ప్రతి ఎమ్మెల్యే కృషిచేయాలనిచెప్పిన వెంటనే నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఇప్పటికే పదహరువందల మంది సభ్యులున్న సోషల్‌మీడియాను నిష్ణాతులైన నిపుణులచే శిక్షణ ఇవ్వాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కరణ్‌రెడ్డి సారథ్యంలో శిక్షణను ఇవ్వడం అభినందనీయమని ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో సోషల్‌మీడియా సభ్యుడు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి చేరవేయడంతోపాటు ప్రతిపక్షాల తప్పుడూ ప్రచారాలను ఎప్పటికప్పుడూ తిప్పికొట్టేలా సోషల్‌మీడియా సభ్యులను తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అన్నారు. వేలాదికోట్లు కేటాయించి సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని అన్నారు. ఇప్పటికే టిఆర్‌ఎస్ బలంగా ఉందని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిబైకాని శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, సోషల్‌మీడియా ట్రైనర్ కరణ్‌రెడ్డిలతోపాటు టిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, విద్యార్థిసంఘాలు, సోషల్‌మీడియా సభ్యులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: