అమెరికా వీసాకు ‘సామాజిక’ షరతు…

  సోషల్ మీడియా వివరాలు, ఐదేళ్ల ఇ-మొయిల్ చిట్టా ఇవ్వాలని ఆదేశాలు సందర్శకులపై ఆరాకు అధ్యక్షుడు ట్రంప్ చర్యలు వాషింగ్టన్ : అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా వారి సోషల్ మీడియా వాడకం వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. సోషల్ మీడియా ఖాతాల వివరాలను అందించాల్సి ఉంటుంది. కనీసం ఐదేళ్లుగా తాము వాడుతున్న ఇ మొయిల్ వివరాలనూ పొందుపర్చాలి. తాత్కాలిక వీసాలకు దరఖాస్తుదార్లతో పాటు అన్ని రకాల వీసాలకు ఈ నిబంధన అమలు చేస్తారు. […] The post అమెరికా వీసాకు ‘సామాజిక’ షరతు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సోషల్ మీడియా వివరాలు, ఐదేళ్ల ఇ-మొయిల్ చిట్టా ఇవ్వాలని ఆదేశాలు
సందర్శకులపై ఆరాకు అధ్యక్షుడు ట్రంప్ చర్యలు

వాషింగ్టన్ : అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా వారి సోషల్ మీడియా వాడకం వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. సోషల్ మీడియా ఖాతాల వివరాలను అందించాల్సి ఉంటుంది. కనీసం ఐదేళ్లుగా తాము వాడుతున్న ఇ మొయిల్ వివరాలనూ పొందుపర్చాలి. తాత్కాలిక వీసాలకు దరఖాస్తుదార్లతో పాటు అన్ని రకాల వీసాలకు ఈ నిబంధన అమలు చేస్తారు. తమ దేశంలోకి వచ్చే విదేశీయుల పూర్వాపరాలను నిశితంగా తనిఖీ చేయడం, ఉగ్రవాదులు, ఇతర ప్రమాదకర వ్యక్తులు వీసాలు పొందకుండా ఉండేందుకు ట్రంప్ అధికార యంత్రాంగం వీసాలపై కటుతర నిబంధనలను తీసుకువచ్చింది.

వీసాలకు దరఖాస్తు చేసుకునే వారు తమ వ్యక్తిగత సమాచారంతో పాటు అనుబంధంగా ఉండే గడులలో తాము వాడే వాట్సప్, ఫేస్‌బుక్ ఇతరత్రా సోషల్ మీడియాల వివరాలను , వీటిని ఏ పేరు మీద వాడుతున్నారనే దానిని స్పష్టంగా పొందుపర్చాల్సి ఉంటుంది. తనిఖీలలో ఈ సమాచారం తప్పని తేలితే వీసాల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. సోషల్ మీడియా ఖాతాలు లేని వారు దానికి సంబంధించి ప్రత్యేకంగా తెలియచేసుకోవల్సి ఉంటుంది. మారిన నిబంధనల మేరకు దరఖాస్తుదార్లు ఈ వివరాలను తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ వారు ప్రకటన వెలువరించారు.

ఇటీవలికాలంలో సోషల్ మీడియా వాడకం దుర్వినియోగం జరుగుతున్నందున ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు, ఈ చర్యల పట్ల సానుభూతిని కల్పించేందుకు ప్రచార మాధ్యమంగా మారుతున్నందున ఇక్కడికి వచ్చే వివిధ దేశాల పౌరుల సోషల్ మీడియా వాడకంపై నిఘా అవసరం అని నిర్థారణకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇ మొయిల్ వివరాలు, ఫోన్ నెంబర్లను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. తాజా నిబంధనలతో దాదాపుగా 14. 7మిలియన్ల మంది పై ప్రభావం పడుతుందని వెల్లడైంది.

ఇప్పటివరకూ ఉన్న నిబంధనల మేరకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు లేదా సానుభూతిపరులు అనే అనుమానాలు ఉన్నట్లు అయితే సదరు వీసా దరఖాస్తు దార్ల నుంచి సోషల్ మీడియా ఖాతాల వివరాలను రాబట్టుకునే వారు. ఇప్పుడు వీసా దరఖాస్తుల ప్రక్రియల క్రమంలోనే అంతా విధిగా నిక్కచ్చిగా వీటి వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. దీనిని నిర్థారిస్తూ ఐదేళ్ల కాలపు ఇ మొయిల్ చిరునామాను ఇవ్వాల్సి ఉంటుంది. మారిన మారుతోన్న నిబంధనల మేరకు తాత్కాలిక వీసాలను కోరుకునే వారు తమను స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు పూర్తిగా ఉన్నప్పటికీ ఇక్కడ వీసా అధికారులు తమ పర్యటన, అమెరికా సందర్శన వివరాలను ఇంతకు ముందటి కన్నా ఎక్కువగా పొందుపర్చాల్సి ఉంటుంది.

అమెరికా సందర్శనకు వచ్చే వారి పూర్వాపరాలను మరింతగా శోధించుకున్న తరువాతనే ఎటువంటి వీసాలను అయినా జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొంటూ 2017 మార్చిలో ట్రంప్ అధికార యంత్రాంగం తీసుకున్న కార్యనిర్వాహక ఆదేశాలకు అనుగుణంగా ఇప్పుడు ఈ నిబంధనను అమలులోకి తెస్తున్నారు.

Social media details Need for American Visa

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమెరికా వీసాకు ‘సామాజిక’ షరతు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: