పాముల పుట్టగా మారిన కలెక్టర్ క్యాంపు కార్యాలయం

మన తెలంగాణ/నారాయణపేట రూరల్‌: నారాయణపేట పట్టణంలోని సత్యసాయి కాలనీలో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం వెనక ఓ ఇంట్లో పాము కనిపించడంతో ఇంటి చుట్టుపక్కల వారు భయందోళనకు గురయ్యారు. అయితే నారాయణపేట జిల్లా కలెక్టర్ నివాస బంగ్లా వెనక భాగంలో పాములు నిత్యం సంచారిస్తున్నాయని అ కాలనీ వాసులు పేర్కొన్నారు. గురువారం హోలీ ఆడుతున్న సందర్భంలో కలెక్టర్ నివాస బంగ్లా కౌంపౌండ్‌లోనే పాములు ఇంతకుముందు నివాసం ఉన్నాయని, గతంలో బంగ్లా మరమ్మత్తుల సమయంలో స్థలాన్ని చదును చేయటంతో […]

మన తెలంగాణ/నారాయణపేట రూరల్‌: నారాయణపేట పట్టణంలోని సత్యసాయి కాలనీలో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం వెనక ఓ ఇంట్లో పాము కనిపించడంతో ఇంటి చుట్టుపక్కల వారు భయందోళనకు గురయ్యారు. అయితే నారాయణపేట జిల్లా కలెక్టర్ నివాస బంగ్లా వెనక భాగంలో పాములు నిత్యం సంచారిస్తున్నాయని అ కాలనీ వాసులు పేర్కొన్నారు. గురువారం హోలీ ఆడుతున్న సందర్భంలో కలెక్టర్ నివాస బంగ్లా కౌంపౌండ్‌లోనే పాములు ఇంతకుముందు నివాసం ఉన్నాయని, గతంలో బంగ్లా మరమ్మత్తుల సమయంలో స్థలాన్ని చదును చేయటంతో కొంత సమస్య తీరినా పాములు మాత్రం కలెక్టర్ బంగ్లాకౌంపౌండ్ నుంచే రాకపోకలు జరుగుతుండటంతో కాలనీ వాసులు వాపోతున్నారు. కాగా గురువారం పాము కనిపించటంతో పాములు పట్టే వ్యక్తి పామును పట్టుకుని తీసుకెళ్ళటంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. నారాయణ పేట జిల్లా కావటంతో అటవీశాఖ కార్యాలయలం ఉండటంతో వారితో పాములు రాకుండా తగు చర్యలు తీసుకోవటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

 

So Many Snakes in Collector Office in Mahaboobnagar

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: