భారత మహిళల గెలుపు

గాలె: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 35.1 ఓవర్లలో కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 19.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ స్మృతి మందన అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు ఘన విజయం సాధించి పెట్టింది. లంక బౌలర్లను హడలెత్తించిన మందన 76 బంతుల్లో […]

గాలె: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 35.1 ఓవర్లలో కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 19.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ స్మృతి మందన అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు ఘన విజయం సాధించి పెట్టింది. లంక బౌలర్లను హడలెత్తించిన మందన 76 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 73 పరుగులు చేసి జట్టును గెలిపించింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ 24 పరుగులు చేసింది. అంతకుముందు శ్రీలంక 98 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో లంక బ్యాటర్లను హడలెత్తించారు. లంక జట్టులో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. 8 మంది బ్యాట్స్‌విమెన్‌లు డబుల్ డిజిట్ మార్క్‌ను అందుకోలేక పోయారు. ఓపెనర్ చమరి ఆటపట్టు (33), శ్రీపలి (26) మాత్రమే కాస్త మెరుగ్గా రాణించారు. భారత బౌలర్లలో మాన్సి జోషి మూడు, జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. రెండో వన్డే గురువారం జరుగుతుంది.

Comments

comments

Related Stories: