ధూమపానానికి భారీ మూల్యం ఏది..?

నిబంధనలు పాటించని పొగరాయుళ్లు
అనారోగ్యంతో పాటు సమాజానికి చేటు
అమలుగాని చట్టాలతో యథేచ్చగా బహిరంగ ప్రదేశాల్లోనే ధూమపానం
నిర్వీర్యమవుతున్న యువత

cigarette Smoke problems

మన తెలంగాణ/హాలియా: ఈ రోజుల్లో యువత సిగరేట్ తాగడాన్ని కూడా ఒక ప్యాషన్‌లా భావిస్తున్నారు. స్టైల్‌గా సిగరేట్ తీసి నోట్లో పెట్టి గుప్పుమని పొగ ఊదుతూ తెగ పోజులు కొడుతున్నారు. గాలిలోకి వొదిలే పొగ కంటే ఎదుటి వారి ముఖాల మీదికి వదిలే పొగే ఎక్కువ ఆ పొగ వాసన చుట్టుపక్కల వారికి ఎంతో ఇబ్బందిగా ఉంటుందో కూడా ఆలోచించటం లేదు. సిగరేట్ తాగే వారి జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా పక్కవారి జీవితాలను కూడా హరిస్తున్నారు. రన్ ఔట్ కావొద్దు..ధూమపానం ఆరోగ్యానికి హానికరం బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయకండి అంటూ…నిత్యం సినిమా థియేటర్లలో ఊదరకొడుతున్నా…ఈ ధూమపానం ప్రకటనల గురించి పొగతాగే వారు ఎంతవరకు ఆలోచిస్తున్నారు…? అంటే లేదనే చెప్పాలి. సినిమాలో విరామం రాగానే బయటకు వచ్చి దమ్ముకొట్టేవారే ఎక్కువ ఉన్నారు. బహిరంగప్రదేశాలలో తాగే వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. వీరిపై సినిమాల ప్రభావం లేకపోలేదు.

ప్యాషన్ అంటూ… ప్యాషన్ అంటూ కొందరు, అలవాటు అంటూ ఇంకొందరు పొగను పీల్చి ఊదేస్తున్నారు. ఇందులో విద్యార్ధులు, యువకులు అధికంగా ఉన్నారు. అడిగే వారు లేరని ఇష్టానుసారంగా బహిరంగంగా ధూమపానం చేస్తున్నారు. బస్టాండ్, సినిమా హాల్లు, టీ దుకాణాల వద్ద విచ్చలవిడిగా పొగ తాగుతున్నారు.

Cancer

నిషేధిత ప్రాంతాలు ఇవే…బస్‌స్టాపులు, ఆటోస్టాండ్‌లు, టీ స్టాల్స్, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలు ఎక్కువగా ఉండే మార్కెట్ ప్రాంతాలు, హోటల్లు, సినిమాహాళ్ల వద్ద ధూమపానం నిషేధిత ప్రాంతాలలోనే పొగ రాయుళ్లు విచ్చల విడిగా ధూమపానం చేస్తూ ఇతరులకు హాని కలిగిస్తున్నారు. ధూమపానం నిషేధిత బోర్డులు మచ్చుకైనా కనిపించడం లేవు.
జరిమానాల జాడేలేదు…బహిరంగ ప్రదేశాలలో నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా ధూమపానం చేస్తే జరిమాన విధించి మందలించాలని సుప్రీంకోర్టు పేర్కోంది. పొగతాగితే నేరంగా ఎన్ని సార్లు పట్టుబడ్డారు. నిషేధిత స్థలాలా ప్రభావాన్ని పరిఘణలోకి తీసుకుని పొగ రాయుళ్లకు రూ.200 నుండి 2 వేల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. కానీ కోర్టు ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర కారణాలతో భారీగా జరిమానాలు వేసే పోలీసులు ప్రజారోగ్యంపై హాని కలిగించే పొగ రాయుళ్ల పై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బహిరంగప్రదేశాలలో ధూమపానం నిషేధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం 2002లో ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పొగాకు ఉత్పత్తుల చట్టం 2003న ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అయితే ఆ చట్టం ఎక్కడా అమలు కావడం లేదు. దీనికి తోడు 2008 అక్టోబర్ 2 నుండి బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడం నిషేదిస్తూ ప్రొహిబీషన్ ఆఫ్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ రూల్స్ యాక్ట్ 2003 దేశ వ్యాప్తంగా మరో చట్టం చేశారు. దీనిని అమలు చేయాల్సిన పోలీస్‌శాఖ, పుడ్ అండ్ డ్రగ్గ్ ఇన్స్‌పెక్టర్ ఇతర అధికారులు పట్టించుకోకపోవడంతో బహిరంగప్రదేవాలలో ధూమపానం విచ్చలవిడిగా చేస్తున్నారు. అనేక రోగాలు (క్యాన్సర్, ఊపిరితిత్తులు) కారణమవుతున్నపొగరాయుళ్లపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావు ఇస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలకు భారీగా ఖర్చులు చేస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం తీవ్ర నిర్లక్షం కనిసిస్తోంది.

కఠిన చర్యలు తీసుకుంటాం: సిఐ ధనుంజయ్యగౌడ్ హాలియా.

బహిరంగ ధూమపానాన్ని ప్రభుత్వం నిషేదించింది. ప్రజలకు ఇబ్బందులు కల్గించేలా ధూమపానం చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తాం. పబ్లిక్ స్థలాలలో సిగరేట్లు, బీడిలు, తాగేవారిపై నిఘా ఉంచుతాం. ప్రజలకు హాని కలిగించే వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ధూమపానానికి భారీ మూల్యం ఏది..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.