50,000 వివో రిటైల్ ఔట్‌లెట్‌లు

Vivo India

50 వేల రిటైల్ భాగస్వాములతో వివో ఇండియా సన్నద్ధం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నాలుగో విడత ముగియనుండడంతో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ నెమ్మదిగా పుంజుకుంటోందని వివో ఇండియా పేర్కొంది. దేశవ్యాప్తంగా 70 శాతం లేదా 50,000 వివో రిటైల్ భాగస్వామి ఔట్‌లెట్‌లు ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం పనిచేస్తున్నాయి. అలాగే కరోనా నేపథ్యంలో రిటైల్ మార్జిన్లలో ఎటువంటి మార్పు లేదు.

వినియోగదారుల ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ అవసరాలను తీర్చేందుకు వివో దేశవ్యాప్తంగా రిటైల్ నెట్‌వర్క్‌ను పెంచుకుంటోంది. దీని కోసం కొత్త వివో స్మార్ట్ రిటైల్ మోడల్‌ను అవలంభించింది. ఇది వినియోగదారులకు వారి ఇళ్ల సౌకర్యాల నుండి రిటైల్ వ్యాపారులతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. దేశంలో అతిపెద్ద ప్రమోటర్ నెట్‌వర్క్‌తో వివో ఇండియా ఒక బలమైన ప్రక్రియను ఏర్పాటు చేసింది. ఇది ఆఫ్‌లైన్ భాగస్వాములను వినియోగదారులతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.

Smartphone sales getting back on track

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 50,000 వివో రిటైల్ ఔట్‌లెట్‌లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.