చిన్న డీజిల్ కార్లకు ‘టాటా’

  న్యూఢిల్లీ: ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తమ జాబితాను చిన్న డీజిల్ కార్లను విరమించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. బిఎస్6 నిబంధలను అమలు చేయాల్సి వస్తుండడంతో కంపెనీ ఈ చిన్న డీజిల్ కార్లను నిలివేయాలనే వచ్చినట్టు సంస్థకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. టాటా మోటార్స్ ప్రస్తుతం విక్రయించిన 1 లీటర్ ఇంజన్ సామర్థం కల్గిన ఎంట్రీ లెవెల్ హాచ్‌బ్యాక్ టియాగో, 1.05 లీటర్ సామర్థం కల్గిన టైగర్, 1.3 లీటర్ సామర్థం కల్గిన బోల్ట్, జెస్ట్ […] The post చిన్న డీజిల్ కార్లకు ‘టాటా’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ఆటో దిగ్గజం టాటా మోటార్స్ తమ జాబితాను చిన్న డీజిల్ కార్లను విరమించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. బిఎస్6 నిబంధలను అమలు చేయాల్సి వస్తుండడంతో కంపెనీ ఈ చిన్న డీజిల్ కార్లను నిలివేయాలనే వచ్చినట్టు సంస్థకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. టాటా మోటార్స్ ప్రస్తుతం విక్రయించిన 1 లీటర్ ఇంజన్ సామర్థం కల్గిన ఎంట్రీ లెవెల్ హాచ్‌బ్యాక్ టియాగో, 1.05 లీటర్ సామర్థం కల్గిన టైగర్, 1.3 లీటర్ సామర్థం కల్గిన బోల్ట్, జెస్ట్ వంటి డీజిల్ కార్లు ఉన్నాయి. టాటా మోటార్స్ ప్రెసిడెంట్ ప్యాసింజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ మయాంక్ పరీక్ మాట్లాడుతూ, ఎంట్రీ లెవెల్, మిడ్ సైజ్ డీజిల్ కార్లకు డిమాండ్ అంతగాలేదని, చిన్న ఇంజన్ సామర్థం మెరుపర్చడంలో అధిక వ్యయం అవుతోందని అన్నారు. బిఎస్6 ఇంజన్లను ప్రవేశపెట్టడం వల్ల ఖర్చు పెరుగుతోందని, ప్రత్యేకించి చిన్న డీజిల్ కార్లకు అధిక వ్యయమవుతోందని అన్నారు.

Small diesel engine no longer cost effective

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చిన్న డీజిల్ కార్లకు ‘టాటా’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: