గ్రేటర్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్

  హైదరాబాద్: నగరంలో కరోనా విజృంభణకు అధికారులు చేపడుతున్న చర్యలతో తగ్గుముఖం పడుతుంది. వారం రోజుల నుంచి నమోదైతున్న పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే గడిచిన నెలకంటే చాలా వరకు కేసులు తగ్గినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. మహమ్మారి విస్తరించకుండా ఉండేందుకు కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసి ఒకరి నుంచి మరొకరి సొకకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో కరోనా వేగం తగ్గిందని చెబుతున్నారు. ఈనెలావరకు మరింత తగ్గే అవకాశం ఉందని, ప్రజలు వైద్యుల సూచనలు పాటించి జాగ్రత్తగా ఉంటే సగంవరకు […] The post గ్రేటర్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: నగరంలో కరోనా విజృంభణకు అధికారులు చేపడుతున్న చర్యలతో తగ్గుముఖం పడుతుంది. వారం రోజుల నుంచి నమోదైతున్న పాజిటివ్ కేసుల సంఖ్య చూస్తే గడిచిన నెలకంటే చాలా వరకు కేసులు తగ్గినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. మహమ్మారి విస్తరించకుండా ఉండేందుకు కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసి ఒకరి నుంచి మరొకరి సొకకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో కరోనా వేగం తగ్గిందని చెబుతున్నారు. ఈనెలావరకు మరింత తగ్గే అవకాశం ఉందని, ప్రజలు వైద్యుల సూచనలు పాటించి జాగ్రత్తగా ఉంటే సగంవరకు కట్టడి చేయవచ్చంటున్నారు. గత ఐదు నెలల నుంచి ప్రజలతో చెలగాటమాడిన వైరస్ మార్చిలో మహేంద్రహిల్స్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్‌తో నమోదైన మొదటి కేసు, ఏప్రిల్‌లో పదుల సంఖ్యకు చేరి మే మాసంలో ఢిల్లీ మర్కజ్ కేసులో వైరస్ విస్తరించి రోజుకు వందల కేసుల వరకు పరిస్దితి మారింది.

తరువాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్దాన్, డిల్లీకి వలస వెళ్లి వేలాదిమంది కూలీలు తిరిగి స్వస్దలాలకు రావడంతో కరోనా రెక్కలు కట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. జూన్ మాసంలో రోజుకు సగటు 1200లకు పైగా పాజిటివ్ కేసులు నమోదై తెలుగు రాష్ట్రాల్లో రాజధాని అగ్రస్దానంలో నిలిచింది. దీంతో ప్రభుత్వం, వైద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి కరోనా విస్తరించకుండా పలు చర్యలు చేపట్టారు. జూలై నెలాఖరు నుంచి నగరంలో 185 పట్టణ,ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించింది. టెస్టులు పెంచడంతో 10 రోజులు కేసులు రోజుకు సగటు 800వరకు నమోదైయ్యాయి. అయిన అధికారులు నిర్లక్షం చేయకుండా కేసులు ఎక్కువగా నమోదు అయ్యే ప్రాంతాలను గుర్తించి 92 కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసి మొబైల్ టెస్టులు చేసింది. టెస్టులు ఎక్కువ శాతంలో చేయడంతో కొద్దిరోజుల పెరిగిన కేసులు తరువాత తగ్గుముఖం పట్టాయి.

గత వారం రోజుల నుంచి పాజిటివ్ కేసులు సంఖ్య 500లోపు వస్తున్నాయి. వైద్యాశాఖ వివరాల ప్రకారం జూలై 26న 506 పాజిటివ్ కేసులు 27వ తేదీన 531, 28న 509కేసులు, 29వ తేదీన 521, 30వతేదీన 586, 31న 578 కేసులు, ఆగస్టు 1న 517, ఆగస్టు 2న 273, ఆగస్టు 3వ తేదీన 391 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 68,946 పాజిటివ్ కేసులుగా గ్రేటర్ నగరంలో 54,150 కేసులు నమోదై మొదటిస్దానంలో నిలిచింది. 470మంది మృత్యువాత పడ్డారు. టెస్టులు పెద్ద ఎత్తు చేయడంతో ప్రారంభంలో ఎక్కువ సంఖ్యలో బయపడ్డాయని, వారం రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వైద్యాధికారులు భావిస్తున్నారు. వర్షాలు ఎక్కువ కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులతో పాటు కరోనా వైరస్ కాటు వేస్తుందని నగర ప్రజలు రోడ్లపై ఇష్టానుసారంగా తిరగకుండా అత్యవసరాల కోసం రావడంతో వైరస్ ఇతరులకు సోకకుండా ఉందని పేర్కొంటున్నారు. వైద్యశాఖ సూచించిన సలహాలు ప్రజలు పాటిస్తే కొద్ది రోజుల్లోనే కరోనా వేగానికి కళ్లెం వేయవచ్చంటున్నారు.

Slight decline in Covid-19 positive case in GHMC

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post గ్రేటర్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: