కాఫీపొడితో చర్మ సంరక్షణ…

  ఎంత జాగ్రత్త పడినా ముఖంలో మృత కణాలు పేరుకుపోతుంటుంది. బయట తిరగడం వల్ల వాతావరణ కాలుష్యం వల్ల మనకు తెలియకుండానే దుమ్ము, ధూళి ముఖాన వచ్చి చేరుతుంటుంది. ఎంత సబ్బు పెట్టి శుభ్రం చేసుకున్నా అవి పోవు. మరి వాటిని ఎలా తొలగించుకోవాలో చూద్దాం.. కాఫీపొడి: పావు కప్పు చొప్పున కాఫీపొడి, చక్కెర, రెండు పెద్ద చెంచాల ఆలివ్‌నూనె, మూడు విటమిన్-ఇ మాత్రలు తీసుకుని అన్నింటినీ కలపాలి. మొదట చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత […] The post కాఫీపొడితో చర్మ సంరక్షణ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎంత జాగ్రత్త పడినా ముఖంలో మృత కణాలు పేరుకుపోతుంటుంది. బయట తిరగడం వల్ల వాతావరణ కాలుష్యం వల్ల మనకు తెలియకుండానే దుమ్ము, ధూళి ముఖాన వచ్చి చేరుతుంటుంది. ఎంత సబ్బు పెట్టి శుభ్రం చేసుకున్నా అవి పోవు. మరి వాటిని ఎలా తొలగించుకోవాలో చూద్దాం..
కాఫీపొడి: పావు కప్పు చొప్పున కాఫీపొడి, చక్కెర, రెండు పెద్ద చెంచాల ఆలివ్‌నూనె, మూడు విటమిన్-ఇ మాత్రలు తీసుకుని అన్నింటినీ కలపాలి. మొదట చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని శరీరమంతా రాసి, నెమ్మదిగా మర్దన చేయాలి. పది నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో రెండు మూడుసార్లు ఇలా చేయొచ్చు. కాఫీలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి చర్మానికి పోషణ అందిస్తాయి. చక్కెర మృతచర్మాన్ని తొలగిస్తుంది. ఆలివ్‌నూనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
కొబ్బరినూనె: అరకప్పు చక్కెర, పావుకప్పు కొబ్బరినూనె తీసుకోవాలి. ఈ రెండింటినీ కలిపి చర్మానికి రాసుకోవాలి. నెమ్మదిగా మర్దన చేస్తే… మృతకణాలు పోతాయి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. అలంకరణ తాలూకు అవశేషాలు ఉన్నా పూర్తిగా పోతాయి. చర్మం తేమగా, తాజాగా మారుతుంది.
ఆలివ్‌నూనె, పిప్పర్‌మెంట్, చక్కెర: అరకప్పు ఆలివ్‌నూనె, కప్పు చక్కెర, చెంచా పిప్పర్‌మెంట్ నూనె తీసుకోవాలి. అన్నింటినీ కలిపి శరీరానికి రాసుకోవాలి. పది నిమిషాలు మర్దన చేసి… గోరువెచ్చని నీటితో కడిగేయాలి. చర్మం మృదువుగా మారుతుంది.
ఎప్సమ్ సాల్ట్: కప్పు ఎప్సమ్ సాల్ట్, రెండు చుక్కల ఎసెన్షియల్ నూనె, మూడు చుక్కల జోజోబా నూనె తీసుకోవాలి. అన్నింటినీ కలిపి చర్మానికి రాసుకోవాలి. అది పూర్తిగా ఆరాక గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఎప్సమ్ సాల్ట్‌కు మృతకణాలు తొలగించే గుణాలు ఉంటాయి. గరుకు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కండరాలకు విశ్రాంతినిస్తుంది. ఒళ్లు నొప్పులున్నా పోతాయి.
రెండు మూడు రంగులు కలగలసి లేదా ఒకే రంగులో భిన్నమైన డిజైన్లతో స్పెషల్ లుక్ ఉండే డ్రస్‌ల ట్రెండ్ నడుస్తోందిప్పుడు. ఈ డ్రస్‌లకు మ్యాచయ్యేలా జూకాలు, హైహీల్స్ వేసుకుంటే చాలు సింపుల్ అండ్ ట్రెండీ లుక్ మీ సొంతం అవుతుంది. ఈ డ్రస్‌లు వేసుకుంటే మెడలోకి ఏమీ వేసుకోకపోయినా పర్వాలేదు. డ్రస్ డిజైనే కంఠాభరణం అయిపోతుంది. ఈ ఫోటోలను చూస్తుంటే పొడవు చేతులు స్పెషల్ అట్రాక్షన్‌లా అనిపిస్తున్నాయి కదా. ఈ డ్రస్‌ల కుర్తాల్లో పాదాలను తాకే, మడమ పై భాగం వరకు ఉండే డిజైన్లు కొన్నయితే మరికొన్ని ఎసిమ్మెట్రికల్‌గా ఉంటాయి. వీటికిందకు వేసుకునే సల్వార్‌లను కూడా మీకు నచ్చినట్టు అంటే చుడీదార్, షార్ట్, లాంగ్ లెంగ్త్ మోడల్స్‌లో కుట్టించుకోవచ్చు. రొటీన్ డిజైన్లకి భిన్నంగా ఉండే ఈ డ్రస్‌లని క్యాజువల్‌గానే కాకుండా చిన్న చిన్న పార్టీలకు, ఫంక్షన్లకు కూడా వేసుకెళ్లొచ్చు.

Skincare with coffee powder …

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాఫీపొడితో చర్మ సంరక్షణ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: