సౌందర్య నిధి కాఫీ

  కమ్మని రుచితో ఉండే కాఫీ ఇప్పడు చర్మసౌందర్య ప్రదాయిని కూడా! కాఫీ మన జీవితంలో ఒక భాగం. కమ్మని కాఫీ మెదడుని ఉత్సాహపరుస్తుంది. అలాగే ఈ అద్భుతమైన పానీయాన్ని మితంగా తీసుకుంటే ఎంతో ఆరోగ్యం అని అధ్యయనాలు తేల్చాయి. చర్మ సౌందర్యం కోసం కాఫీ ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు. కాఫీలోని కెఫీన్ ఆసిడ్ డొల్లాజెన్ ఉత్పత్తికి దోహదపడుతోంది. చర్మం పైన మృతకణాలను తొలగిస్తుంది. మార్కెట్లో ఇప్పుడు కాఫీ బాడీ స్క్రబ్ కూడా లభిస్తుంది. చర్మ […] The post సౌందర్య నిధి కాఫీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కమ్మని రుచితో ఉండే కాఫీ ఇప్పడు చర్మసౌందర్య ప్రదాయిని కూడా! కాఫీ మన జీవితంలో ఒక భాగం. కమ్మని కాఫీ మెదడుని ఉత్సాహపరుస్తుంది. అలాగే ఈ అద్భుతమైన పానీయాన్ని మితంగా తీసుకుంటే ఎంతో ఆరోగ్యం అని అధ్యయనాలు తేల్చాయి. చర్మ సౌందర్యం కోసం కాఫీ ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు.

కాఫీలోని కెఫీన్ ఆసిడ్ డొల్లాజెన్ ఉత్పత్తికి దోహదపడుతోంది. చర్మం పైన మృతకణాలను తొలగిస్తుంది. మార్కెట్లో ఇప్పుడు కాఫీ బాడీ స్క్రబ్ కూడా లభిస్తుంది. చర్మ సౌందర్యం కోసం ఖరీదైన ఉత్పత్తుల కంటే సహజమైన ఈ కాఫీపొడి ఎంతో మేలు.

ఫేస్ స్క్రబ్: కాఫీ పొడి, బ్రౌన్ షుగర్, ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని ఫేస్ స్క్రబ్‌గా ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమంలో మొహంపైన గుండ్రని కదలికతో మృదువుగా రుద్దితే మృత కణాలు పోతాయి.

1. యోగర్డ్, తేనె రెండేసి స్పూన్లు తీసుకుని, రెండు స్పూన్ల కాఫీ పొడి కలిపి ఈ మిశ్రమంతో ఫేస్‌ప్యాక్‌లా వేసుకుని అరగంట ఆగాక కడిగేస్తే చాలు. చర్మం కాంతివంతంగా మృదువుగా కనిపిస్తుంది. చిక్కని పాలు కలిపిన కాఫీతో ఫేస్ పాక్ వేసుకోవచ్చు.

2. అలసటతో కళ్లు ఉబ్బినప్పుడు కాఫీతో తయారు చేసిన ఐస్‌కూబ్స్ మంచి ఫలితం చూపిస్తాయి. కాఫీని ఐస్ ట్రేలో పోసి డీప్‌ఫ్రీజర్‌లో ఉంచి, ఆ ఐస్ క్యూబ్‌ను కళ్ల చుట్టూ నెమ్మదిగా రుద్దితే కళ్లు తేటగా ఉంటాయి. మెత్తని కాఫీపొడిలో తేనె కలిపి ఫేస్‌ప్యాక్ వేసుకోవచ్చు. ఈ ప్యాక్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. సువాసన గల కాఫీపొడిని ఆరోమా థెరఫీతో కూడా ఉపయోగిస్తున్నారు.

3. రెండు టీస్పూన్ల కాఫీ పౌడర్, తేనె నిమ్మరసం కలిపిన ప్యాక్‌ని మొహంపైన మెడచుట్టు వేసి ఓ అరగంట ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేస్తే సరిపోతుంది. మార్కెట్లో కాఫీ బాడీ స్క్రబ్ రెడీమేడ్‌గా దొరకుతుంది. ఇంట్లో తయారుచేసుకోవటం కూడా సులభమే. ఫ్రెష్‌గా ఉండే కాఫీపొడి అరకప్పు, బ్రౌన్ షుగర్ అరకప్పు, కొబ్బరినూనె అరకప్పు కలిపితే చక్కని బాడీ స్క్రబ్ తయారవుతుంది. దీన్ని కళ్లచుట్టూ, శరీరం మొత్తంగా అప్లయ్ చేసి నెమ్మదిగా వేళ్లతో రుద్దితే చాలు, మృతకణాలు పోయి చర్మం చక్కగా మెరుపుతో ఉంటుంది.

Skin Beauty with Coffee

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సౌందర్య నిధి కాఫీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: