టాప్ 6 కంపెనీల నష్టం రూ.87,973 కోట్లు

  న్యూఢిల్లీ: గత వారం టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) రూ.87,973.5 కోట్లు తగ్గింది. టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి సంస్థలు మార్కెట్ విలువలో అత్యధిక పతనాన్ని నమోదు చేశాయి. వీటితో పాటు క్యాపిటలైజేషన్ క్షీణించిన సంస్థలలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలీవర్, ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లు మార్కెట్ విలువను పెంచుకున్నాయి. టాటా […] The post టాప్ 6 కంపెనీల నష్టం రూ.87,973 కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: గత వారం టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) రూ.87,973.5 కోట్లు తగ్గింది. టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి సంస్థలు మార్కెట్ విలువలో అత్యధిక పతనాన్ని నమోదు చేశాయి. వీటితో పాటు క్యాపిటలైజేషన్ క్షీణించిన సంస్థలలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలీవర్, ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లు మార్కెట్ విలువను పెంచుకున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మార్కెట్ విలువ రూ.22,664 కోట్లు తగ్గి రూ.8,24,642 కోట్లకు చేరింది.

హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ విలువ 21,492.9 కోట్ల రూపాయలు తగ్గి 3,52,367 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ .16,386 కోట్లు తగ్గి రూ.7,74,957 కోట్లకు, హిందుస్తాన్ యూనిలీవర్ విలువ రూ.13,300.7 కోట్లు తగ్గి రూ.3,93,703 కోట్లకు చేరాయి. ఇక ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,163.3 కోట్లు తగ్గి రూ.2,52,811.76 కోట్లకు, ఐటిసి క్యాపిటలైజేషన్ రూ.1,965.59 కోట్లు తగ్గి రూ.2,99,692.17 కోట్లకు చేరుకుంది. వీటికి భిన్నంగా ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ .10,973.83 కోట్లు పెరిగి రూ.3,60,847.99 కోట్లకు చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలువ రూ.4,692 కోట్లు పెరిగి రూ.6,14,134 కోట్లకు చేరుకుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ విలువ రూ.1,924 కోట్లు పెరిగి రూ .2,75,318.74 కోట్లకు, ఎస్‌బిఐ విలువ రూ .223.11 కోట్లు పెరిగి రూ.2,44,489 కోట్లకు చేరుకున్నాయి. బిఎస్‌ఇ 30 షేర్ల సెన్సెక్స్ గతవారాంతం శుక్రవారం నాటికి 351.02 పాయింట్లు (0.94 శాతం) నష్టపోయింది. మార్కెట్ విలువ పరంగా టిసిఎస్ పది కంపెనీలలో మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, ఐటిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ ఉన్నాయి.

Six of Top 10 Firms Shed Rs 87,973.5 Crore

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టాప్ 6 కంపెనీల నష్టం రూ.87,973 కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.