కతువా కేసులో ఆరుగురు దోషులు

జ‌మ్మూక‌శ్మీర్‌ : క‌తువాలో గ‌త ఏడాది 8 ఏళ్ల బాలిక‌పై సామూహిక అత్యాచరం చేసి, అనంతరం హత్య చేశారు.  ఈ కేసులో సోమవారం ప‌ఠాన్‌కోట్ కోర్టు  తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆరుగురు వ్యక్తులను దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.  అత్యాచార కేసులో ప్ర‌ధాన నిందితుడు పూజారి సంజీ రామ్‌ను దోషిగా తేల్చారు. అయితే ఆయ‌న కొడుకు విశాల్‌ను మాత్రం  కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు విచార‌ణ‌ను ఈనెల ముగించారు. ఈ  కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న […] The post కతువా కేసులో ఆరుగురు దోషులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జ‌మ్మూక‌శ్మీర్‌ : క‌తువాలో గ‌త ఏడాది 8 ఏళ్ల బాలిక‌పై సామూహిక అత్యాచరం చేసి, అనంతరం హత్య చేశారు.  ఈ కేసులో సోమవారం ప‌ఠాన్‌కోట్ కోర్టు  తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆరుగురు వ్యక్తులను దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.  అత్యాచార కేసులో ప్ర‌ధాన నిందితుడు పూజారి సంజీ రామ్‌ను దోషిగా తేల్చారు. అయితే ఆయ‌న కొడుకు విశాల్‌ను మాత్రం  కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు విచార‌ణ‌ను ఈనెల ముగించారు. ఈ  కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న విశాల్‌, ఘటన జరిగిన సమయంలో ప‌రీక్ష‌లు రాస్తున్న‌ట్లు కోర్టుకు అతని తరపు న్యాయవాదులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో యూపీలోని మీర‌ట్‌లో విశాల్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన‌ట్లు కోర్టు ముందు ఆధారాలు స‌మ‌ర్పించారు. ఈ క్రమంలో ఈ కేసులో విశాల్ ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది.  మధ్యాహ్నం తరువాత దోషులకు శిక్ష్ ఖరారు చేయనున్నారు. క‌తువా అత్యాచార కేసులో దోషులుగా తేలిన వారిలో సాంజీ రామ్‌, ఆనంద్ ద‌త్త‌, ప్ర‌వేశ్ కుమార్‌, దీప‌క్ ఖాజురియా, సురేంద‌ర్ వ‌ర్మ‌, తిల‌క్ రాజ్‌లు ఉన్నారు. వీరు నేరం చేసినట్టు కోర్టు నిర్ధారించింది. ఈ కేసు తీర్పు సందర్భంగా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Six Convicts in the Kathua Rape Case

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కతువా కేసులో ఆరుగురు దోషులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: