భయపెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ

ఆకట్టుకునే కంటెంట్ ఉంటే హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని తెలుగు ప్రేక్షకులు నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి మంచి కంటెంట్ తో వస్త్తున్న చిత్రం ‘శివరంజని’. హాట్ బ్యూటీ రష్మి గౌతమ్, నందు జంటగా నందినిరాయ్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ “ ట్రైలర్ చాలా బావుంది. టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పుడు వస్తోన్న […] The post భయపెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆకట్టుకునే కంటెంట్ ఉంటే హారర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదని తెలుగు ప్రేక్షకులు నిరూపిస్తూనే ఉన్నారు. అలాంటి మంచి కంటెంట్ తో వస్త్తున్న చిత్రం ‘శివరంజని’. హాట్ బ్యూటీ రష్మి గౌతమ్, నందు జంటగా నందినిరాయ్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ “ ట్రైలర్ చాలా బావుంది. టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పుడు వస్తోన్న హారర్ చిత్రాలకు భిన్నమైన కంటెంట్ ఈసినిమాలో కనిపిస్తోంది. ఈసినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. దర్శకుడు నాగప్రభాకరన్ మాట్లాడుతూ “హారర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే అంశాలకు భిన్నంగా కనిపించే కథ ఇది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ మధ్య నడిచే హారర్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. ప్రస్తుతం పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని జూన్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నాం”అని తెలిపారు.

Sivaranjani Movie Trailer launched by V V Vinayak

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భయపెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: