యాక్షన్, ఫాంటసీ ఎంటర్‌టైనర్

  తమిళ, మలయాళ భాషలలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆర్.కె.సురేష్ ఇప్పుడు ‘శివలింగాపురం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. మధుబాల కథానాయికగా నటించిన ఈ చిత్రానికి తోట కృష్ణ దర్శకుడు. రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆడియోను ఆవిష్కరించగా… ట్రైలర్‌ను హీరో ఆర్.కె.సురేష్ […] The post యాక్షన్, ఫాంటసీ ఎంటర్‌టైనర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తమిళ, మలయాళ భాషలలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆర్.కె.సురేష్ ఇప్పుడు ‘శివలింగాపురం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. మధుబాల కథానాయికగా నటించిన ఈ చిత్రానికి తోట కృష్ణ దర్శకుడు. రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆడియోను ఆవిష్కరించగా… ట్రైలర్‌ను హీరో ఆర్.కె.సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ “ సినిమాలు తీయడమే కాకుండా సమాజానికి ఎంతో సేవ చేసిన వ్యక్తిగా రావూరి వెంకటస్వామికి మంచి పేరుంది. అభిరుచితో ఆయన తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలి.

ఈ చిత్రం హీరో ఆర్.కె.సురేష్‌ను చూస్తుంటే జూనియర్ రజనీకాంత్ మాదిరిగా…ప్రతినాయకుడిగా నటించిన డి.ఎస్.రావును చూస్తుంటే జూనియర్ అమ్రిష్‌పురిలా అనిపిస్తున్నారు”అని అన్నారు. చిత్ర నిర్మాత రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ “గతంలో లిటిల్ హార్ట్, మా తల్లి గంగమ్మ, కొక్కొరోకో వంటి సినిమాలు తీశాను. ఇది నా ఆరవ చిత్రం. ఇక తోట కృష్ణ దర్శకత్వంలోనే ఇంకో చిత్రం చేయాలని అనుకుంటున్నాను. ఈ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం”అని తెలిపారు. చిత్ర దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ “గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని మలచడం జరిగింది. ఇందులో అన్నా చెల్లెలి సెంటిమెంట్ హైలైట్ అవుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.రావు, తుమ్మపల్లి రామసత్యనారాయణ, మోహన్ వడ్లపట్ల, సాయివెంకట్, మోహన్‌గౌడ్, రాకేష్ రెడ్డి, పద్మిని నాగులపల్లి తదితరులు పాల్గొన్నారు.

Sivalingapuram Movie Trailer Launched by RK Suresh

The post యాక్షన్, ఫాంటసీ ఎంటర్‌టైనర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: