రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి కెటిఆర్ హామీ….

హైదరాబాద్: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి కెటిఆర్‌ను పలు ఉద్యోగ సంఘాల నాయకులు కలిశారు. మంత్రి కెటిఆర్ శుక్రవారం రాజన్న సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కెటిఆర్‌కు వినతిపత్రం ఇచ్చినట్టు ట్రెసా జిల్లా అధ్యక్షుడు జయంత్ కుమార్ తెలిపారు. అబ్ధుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య దురదృష్టకరమని, ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మంత్రి కెటిఆర్ తెలియచేశారని జయంత్‌ కుమార్ చెప్పారు. తహసీల్దార్ల బదిలీలను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేస్తామని, రెవెన్యూ ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం మీ వెనుక ఉందని కెటిఆర్ హామీనిచ్చినట్టుగా జయంత్ పేర్కొన్నారు.

Sircilla Revenue Employees meet KTR

The post రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి కెటిఆర్ హామీ…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.