సింగరేణికి నైనీ బొగ్గు బ్లాకు

వచ్చే ఏడాది ప్రారంభానికి సన్నాహాలు ఒడిశా సిఎంతో ఎండి శ్రీధర్ భేటీ మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణికి ఒడిశాలో ఉన్న ‘నైనీ’ బొగ్గును వచ్చే ఏడాది ప్రారంభించడానికి వీలుగా సంస్థ సన్నాహాలు వేగవంతం చేసింది. రాష్ట్ర, దేశ విద్యుత్ అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తిని భారీగా పెంచడానికి నైనీ బ్లాకును అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని సింగరేణి గుర్తించింది. నైనీ ప్రారంభానికి వీలుగా సహకరించాలని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ బుధవారం నాడు కలుసుకున్నారు. దీంతో […] The post సింగరేణికి నైనీ బొగ్గు బ్లాకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వచ్చే ఏడాది ప్రారంభానికి సన్నాహాలు
ఒడిశా సిఎంతో ఎండి శ్రీధర్ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణికి ఒడిశాలో ఉన్న ‘నైనీ’ బొగ్గును వచ్చే ఏడాది ప్రారంభించడానికి వీలుగా సంస్థ సన్నాహాలు వేగవంతం చేసింది. రాష్ట్ర, దేశ విద్యుత్ అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తిని భారీగా పెంచడానికి నైనీ బ్లాకును అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని సింగరేణి గుర్తించింది. నైనీ ప్రారంభానికి వీలుగా సహకరించాలని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ బుధవారం నాడు కలుసుకున్నారు. దీంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ ఆదిత్య ప్రసాధ్ పాథి ని రాజధాని భువనేశ్వర్‌లో కలుసి, పలు అంశాలపై చర్చించారు.
రాష్ట్ర, దేశ విద్యుత్ అవసరాల రీత్యా బొగ్గు ఉత్పత్తిని భారీగా పెంచడంలో భాగంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒడిస్సా రాష్ట్రంలోని అంగూల్ జిల్లాలో నైనీ బ్లాకును తమకు కేటాయించిందనీ, దీనికి సంబంధించి అటవీ, రెవిన్యూ భూముల బదలాయింపు, పునరావాస, రైల్వేలైను సంబంధిత విషయాల్లో ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందించాలని సిఎండి ఎన్.శ్రీధర్ కోరారు. గనికి కావాల్సిన 912.79 హెక్టార్లలో 783.27 హెక్టార్ల అటవీ భూమితో పాటు 129.52 హెక్టార్లలో ఆరు గ్రామాలకు చెందిన ఇతర భూములు ఉన్నాయనీ, వీటిలో కేవలం 14 కుటుంబాల వారికి మాత్రమే పునరావాస అవసరం ఏర్పడుతోందని శ్రీధర్ వివరించారు. ఈ భూముల సేకరణ, ఇతర అనుమతులకు సహకరించాలని కోరారు. సమీపంలోని ఇతర బొగ్గు బ్లాకు కోసం నిర్మించనున్న రైల్వే లైనును నైనీ బొగ్గు బ్లాకు వరకూ కొనసాగించడానికి ప్రభుత్వపరమైన అనుమతులకు సహకారం అందించాలని వివరించగా పూర్తి సహకారం అందిస్తామని ఆదిత్య ప్రసాద్ హామీ ఇచ్చారు.
ఒడిశా సిఎం సహాయనిధికి రూ.కోటి విరాళం
ఇటీవల భారీ వర్షాలు, వరదలతో సతమతమైన ఒడిశా రాష్ట్రానికి చేయూతగా సింగరేణి తరపున కోటి రూపాయల చెక్కును సిఎండి శ్రీధర్ ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు అందజేశారు.
నైనీలో బొగ్గు నిల్వలు 34 కోట్ల టన్నులు
ఒడిశాలో సింగరేణి వచ్చే ఏడాది ప్రారంభించనున్న ‘నైనీ’ బొగ్గు క్షేత్రం సంస్థకు గొప్ప వరంగా మారనుంది. 34 కోట్ల టన్నుల (340 మిలియన్ల) బొగ్గు నిల్వలున్న ఈ క్షేత్రం నుండి ఏడాదికి కోటి టన్నుల (10 మిలియన్ల) బొగ్గును ఉత్పత్తి చేయడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. జనరల్ మేనేజర్ విజయరావును ఈ గని వ్యవహారాల పర్యవేక్షణ అధికారిగా నియమించి ప్రతినెలా పురోగతిని సమీక్షిస్తున్నారు. మార్చి 2020 నాటికి పూర్తి చేసి ఫిబ్రవరి 2021 నాటికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని యాజమాన్యం నిర్ణయించింది.

Singareni Collieries starts work at Naini coal block in Odisha

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సింగరేణికి నైనీ బొగ్గు బ్లాకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.