‘భారత్ కీ లక్ష్మి’ ప్రచారకర్తలుగా సింధు, దీపికా పదుకోనె…

Sindhu, Deepika

 

న్యూఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగా మహిళలు సాధించిన అద్భుత విజయాలను వెలుగులోకి తీసుకు రావడం కోసం ఈ దీపావళిని ‘భారత్ కీ లక్ష్మి’గా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ తన మన్‌కీ బాత్ సందర్భంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా రూపొందించారు. ఈ వీడియో కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకోనె, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధులను ప్రచారకర్త లు(అంబాసిడర్)గా ఎంపిక చేశారు.‘ భారతీయ మహిళలు ప్రతిభకు, దృఢ సంకల్పానికి, అంకిత భావానికి ప్రతీకలు. మహిళల సాధికారికత కోసం కృషి చేయాలని మన సంస్కృతి సంప్రదాయాలు మనకు ఎప్పుడూ బోధిస్తూ ఉన్నాయి.

ఈ వీడియో ద్వారా పివి సింధు, దీపికా పదుకోనెలు భారత్‌కి లక్ష్మి సందేశాన్ని అద్భుతంగా తెలియజేస్తారు’ అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో భాగస్వాములమవుతున్నందుకు తమకెంతో సంతోషంగా ఉందని సింధు, దీపికలు ట్విట్టర్ లో పేర్కొన్నారు. దేశం నలుమూలల్లో ఉండే మహిళలు సాధించిన అద్భుత విజయాలను వెలుగులోకి తీసుకురావడం కోసం ప్రధాని తీసుకున్న ఈ చర్యకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Sindhu, Deepika become Ambassador of #BharatKiLakshmi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘భారత్ కీ లక్ష్మి’ ప్రచారకర్తలుగా సింధు, దీపికా పదుకోనె… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.