హైదరాబాద్ నగర శివారులో సుందర సిక్కు మందిరం

Sikh shrine

 

రాజేంద్రనగర్ సమీపంలో అన్ని హంగులతో గురుద్వారా భవనం, త్వరలో కెసిఆర్ భూమిపూజ : గురునానక్ జయంతి ఉత్సవాల్లో మంత్రి కెటిఆర్

నాంపల్లి : నగర శివారులో సిక్కులు ప్రార్థనలు చేసుకునేందుకు అన్ని హంగులతో సుందరమైన గురుద్వారా నిర్మాణానికి చర్యలు చేపడుతానని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. మంగళవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో గురునానక్‌దేవ్‌జీ 5 50వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కెటిఆర్ మాట్లాడుతూ రాజే ంద్రనగర్ సమీపాన సిఖ్‌చావ్ని ప్రాంతంలో సి క్కులు పడుతున్న ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తానన్నారు. ఈ విషయంలో త్వరలో వారు శుభవార్త వింటారన్నారు. ఈ దిశగా సిఎం కెసిఆర్ పవిత్ర స్థలికి భూమి పూజ చేస్తారన్నారు. గురునానక్ జయం తి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినం ప్రకటించిందని పే ర్కొన్నారు.

సిక్కులు ప్రస్తావించిన పలు సమస్యల పరిష్కారానికి త్వరలో తాను చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. భగవాన్ శ్రీ గురునానక్ జయంతి సందర్భంగా సిక్కులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత సిక్కులు గౌరవంగా కెటిఆర్‌కు సంప్రదాయ తలపాగ చుట్టి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి టి. శ్రీనివాస్ యాదవ్ మేయర్ బొంతు రాంమోహన్, రా ష్ట్ర అదనపు డిజి తేజ్‌దీప్ కౌర్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, నగర గురుద్వారాల అధ్యక్షుడు ఎస్.గురుచరణ్‌సింగ్ బగ్గా, ఎస్. బల్‌దేవ్ సింగ్ బగ్గా, సిక్కులు, హిందువులు పాల్గొన్నారు.

Sikh shrine in the suburb of Hyderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హైదరాబాద్ నగర శివారులో సుందర సిక్కు మందిరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.