టూరిస్టుల కోసం సియాచిన్ యాత్ర

  లెహ్‌లడఖ్ : టూరిస్టుల కోసం సియాచిన్ ఏరియాను ప్రారంభించడానికి నిర్ణయించినట్టు ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ప్రపంచం మొత్తం మీద అత్యంత ఎత్తైన రణక్షేత్రంగా సియాచిన్ చరిత్ర కెక్కింది. సియాచిన్ స్థావర శిబిరం నుంచి కుమార్ పోస్టు వరకు టూరిస్టులు పర్యటించడానికి వీలు కల్పించనున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సోమవారం వెల్లడించారు. సియాచిన్ లోని అసాధారణ వాతావరణంలో నివాస యోగ్యం కాని కొండ శిఖరాల్లో సైనికులు, ఇంజినీర్లు అత్యంత ధైర్య సాహసాలతో ఏ విధంగా […] The post టూరిస్టుల కోసం సియాచిన్ యాత్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లెహ్‌లడఖ్ : టూరిస్టుల కోసం సియాచిన్ ఏరియాను ప్రారంభించడానికి నిర్ణయించినట్టు ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ప్రపంచం మొత్తం మీద అత్యంత ఎత్తైన రణక్షేత్రంగా సియాచిన్ చరిత్ర కెక్కింది. సియాచిన్ స్థావర శిబిరం నుంచి కుమార్ పోస్టు వరకు టూరిస్టులు పర్యటించడానికి వీలు కల్పించనున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సోమవారం వెల్లడించారు. సియాచిన్ లోని అసాధారణ వాతావరణంలో నివాస యోగ్యం కాని కొండ శిఖరాల్లో సైనికులు, ఇంజినీర్లు అత్యంత ధైర్య సాహసాలతో ఏ విధంగా పనిచేస్తున్నారో టూరిస్టులకు తెలియ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.

చైనా భారత్ సరిహద్దుకు 45 కిమీ దూరంలో శ్యోక్ నదిపై కల్నల్ చ్యువాంగ్ రిన్‌చిన్ వంతెన ప్రారంభోథ్సవం సందర్భంగా రాజ్‌నాధ్ ఈ విషయం వెల్లడించారు. లడఖ్ ఎంపి తన ప్రసంగంలో ఈ ప్రాంతాన్ని టూరిజం కోసం తెరవాలని ప్రతిపాదించడం తనకు ఆనందం కలిగించిందని, ఈమేరకు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. జవాన్లు, ఇంజినీర్లు, ఇతర కార్మికుల సమర్థతను ప్రశంసించడానికి ఇది వీలు కల్పిస్తుందని చెప్పారు. ఇప్పుడు ప్రారంభమైన ఈ బ్రిడ్జి 1400 అడుగుల పొడవు ఉంటుంది. అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటైన ఈ బ్రిడ్జి వల్ల దుర్బక్, దౌలత్‌బేగ్ ఓల్డికి అనుసంధానం ఏర్పడుతుంది. ప్రయాణసమయం సగానికి సగం తగ్గుతుంది.

Siachen Glacier opens for Tourism

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టూరిస్టుల కోసం సియాచిన్ యాత్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: