అధికారుల తప్పిదం: ఎస్ఐ అభ్యర్థి పాలిట శాపం

హన్మకొండ: తెలంగాణ లో శనివారం జరిగిన ఎస్ఐ రాత పరీక్షలో అధికారుల తప్పిదంతో  అభ్యర్థికి తీవ్ర నష్టం జరిగింది. రాత పరీక్షకు సంబంధించి అతని పేరిట ఓఎంఆర్‌ షీట్‌ రాలేదని నిర్వాహకులు అనుమతించ లేదు. దీంతో అభ్యర్థి కన్నీటి పర్యంతమయ్యారు. వివరాలలోకి వెళితే… మహబూబాబాద్‌ జిల్లా మరిపెడకు చెందిన భూక్యా సురేష్‌ శనివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ హంటర్‌రోడ్డులోని మాస్టర్జీ కళాశాల పరీక్షా కేంద్రంలో ఎస్ఐ రాత పరీక్ష రాసేందుకు రాగా.. నిర్వాహకులు అతనిని అనుమతించలేదు. […] The post అధికారుల తప్పిదం: ఎస్ఐ అభ్యర్థి పాలిట శాపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హన్మకొండ: తెలంగాణ లో శనివారం జరిగిన ఎస్ఐ రాత పరీక్షలో అధికారుల తప్పిదంతో  అభ్యర్థికి తీవ్ర నష్టం జరిగింది. రాత పరీక్షకు సంబంధించి అతని పేరిట ఓఎంఆర్‌ షీట్‌ రాలేదని నిర్వాహకులు అనుమతించ లేదు. దీంతో అభ్యర్థి కన్నీటి పర్యంతమయ్యారు. వివరాలలోకి వెళితే… మహబూబాబాద్‌ జిల్లా మరిపెడకు చెందిన భూక్యా సురేష్‌ శనివారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ హంటర్‌రోడ్డులోని మాస్టర్జీ కళాశాల పరీక్షా కేంద్రంలో ఎస్ఐ రాత పరీక్ష రాసేందుకు రాగా.. నిర్వాహకులు అతనిని అనుమతించలేదు. మార్చి 11న ఖమ్మంలో నిర్వహించిన అన్ని దేహదారుఢ్య పరీక్షల్లో తాను అర్హత సాధించినట్లు సురేష్‌ తెలిపారు.

అయితే మరుసటి రోజు నోటీసు బోర్డులో తాను క్వాలిఫై కాలేదని ఉండడంతో ఆందోళనతో ఎస్పిని కలిశానని చెప్పారు. ఎస్పి తనను డిజిపి వద్దకు వెళ్లాలని తెలపడంతో సురేష్ హైదరాబాద్‌లోని డిజిపి ఆఫీసుకు వెళ్లాడు. అక్కడ డిజిపిని కలిసి అనుమతి ఇవ్వాలని కోరగా, ఆయన అనుమతి లభించలేదని సురేష్ పేర్కొన్నారు. అయితే ఈ నెల 14న తనకు మెయిన్‌ పరీక్ష రాసేందుకు హాల్‌టికెట్‌ వచ్చింది. శనివారం పరీక్ష కేంద్రానికి వెళ్తే నిర్వాహకులు తన పేరుపై ఓఎంఆర్‌ షీట్‌ రాలేదని.. పరీక్షకు అనుమతించలేదని సురేష్‌ కన్నీటిపర్యంతమయ్యారు.

SI candidate was not allowed to test with Officers Mistake

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అధికారుల తప్పిదం: ఎస్ఐ అభ్యర్థి పాలిట శాపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: