హీరోయిన్సెంట్రిక్ మూవీలో..?

విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఓ విభిన్నమైన హీరోయిన్ సెంట్రిక్ స్టోరీని సిద్ధం చేశారట. ఈ సినిమాలో నటింపచేసేందుకు శ్రియాతో సంప్రదింపులు చేస్తున్నారట. విభిన్న కథలకు దృశ్య రూపమివ్వడంలో చంద్రశేఖర్ ఏలేటి సిద్ధహస్తుడు. సక్సెస్, ఫెయిల్యూర్‌ల గురించి అస్సలు ఆలోచించడు ఈ దర్శకుడు. అందుకే ఆయన నుండి ఐతే, సాహసం, మనమంతా, ప్రయాణం వంటి విభిన్నమైన సినిమాలొచ్చాయి. త్వరలో ఓ యంగ్ హీరోతో చంద్రశేఖర్ ఏలేటి ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఆ హీరో ప్రస్తుతం బిజీగా […] The post హీరోయిన్సెంట్రిక్ మూవీలో..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఓ విభిన్నమైన హీరోయిన్ సెంట్రిక్ స్టోరీని సిద్ధం చేశారట. ఈ సినిమాలో నటింపచేసేందుకు శ్రియాతో సంప్రదింపులు చేస్తున్నారట. విభిన్న కథలకు దృశ్య రూపమివ్వడంలో చంద్రశేఖర్ ఏలేటి సిద్ధహస్తుడు. సక్సెస్, ఫెయిల్యూర్‌ల గురించి అస్సలు ఆలోచించడు ఈ దర్శకుడు. అందుకే ఆయన నుండి ఐతే, సాహసం, మనమంతా, ప్రయాణం వంటి విభిన్నమైన సినిమాలొచ్చాయి. త్వరలో ఓ యంగ్ హీరోతో చంద్రశేఖర్ ఏలేటి ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఆ హీరో ప్రస్తుతం బిజీగా ఉండడంతో ఈ గ్యాప్‌లో చంద్రశేఖర్ ఏలేటి మెదడులో మెదిలిన మరో ఆలోచనను ఆచరణలో పెట్టనున్నారట. అదే హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమా అని తెలిసింది. ఆ సినిమాకే శ్రియా శరణ్‌ని పరిశీలిస్తున్నారట. ఈ సినిమాను మైత్రీ మూవీస్ వారు నిర్మించే అవకాశాలున్నాయని సమాచారం. కథ విషయానికి వస్తే… 10 ఏళ్ల అమ్మాయికి తల్లిగా శ్రియా నటించబోతోందట. ఇక ఈమధ్య విదేశీ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ సినిమాల నుండి కాస్త గ్యాప్ తీసుకుంది శ్రియా. నిజానికి ‘ఎఫ్ 2’లో వెంకటేష్ సరసన శ్రియా నటించాల్సింది. కొన్ని కారణాలతో ఆమె స్థానంలోకి తమన్నా వచ్చి చేరింది. ఇక ప్రస్తుతం ప్రచారంలో ఉన్న చంద్రశేఖర్ ఏలేటి సినిమా ఓకే అయితే త్వరలోనే శ్రియా మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గర కానుంది. మరోవైపు నిహారిక, శ్రియా కాంబినేషన్‌లో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆ మధ్య వార్తల్లో నిలిచింది. ఆ సినిమా పరిస్థితి ఏంటో తర్వాత తెలియ రాలేదు. చూడాలి శ్రియా యాక్టివ్ అయితే ఈ ప్రాజెక్టులన్నీ ఓ కొలిక్కి వస్తాయేమో.

shriya saran play mother role to 10 years old girl

The post హీరోయిన్సెంట్రిక్ మూవీలో..? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: