ఆత్మస్థైర్యంతో దాడులను ఎదుర్కోవచ్చు…

  ఎవరో వస్తారని ఏదో చేస్తారని అనుకొనే కాలం పోయింది. ముఖ్యంగా మహిళలు వారి రక్షణ బాధ్యత స్వయంగా వారే తీసుకోవాలి. కష్టకాలంలో, ప్రమాదంలో ఎవరూ కాపాడలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమను తాము రక్షించుకోవాలంటే ఆత్మస్థైర్యం చాలా అవసరం అంటారు ఐపీఎస్ అధికారిణి సౌమ్యా సాంబశివన్. రోజురోజుకీ ఆడపిల్లలపై పెరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను చూసి ఓ మహిళగా చాలా బాధపడేదాన్నని చెబుతోంది సౌమ్య. ప్రతి చోటా పోలీసులు అందుబాటులో ఉండలేరు కాబట్టి ఎవరికి వారే తమ బాధ్యత […] The post ఆత్మస్థైర్యంతో దాడులను ఎదుర్కోవచ్చు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎవరో వస్తారని ఏదో చేస్తారని అనుకొనే కాలం పోయింది. ముఖ్యంగా మహిళలు వారి రక్షణ బాధ్యత స్వయంగా వారే తీసుకోవాలి. కష్టకాలంలో, ప్రమాదంలో ఎవరూ కాపాడలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తమను తాము రక్షించుకోవాలంటే ఆత్మస్థైర్యం చాలా అవసరం అంటారు ఐపీఎస్ అధికారిణి సౌమ్యా సాంబశివన్.

రోజురోజుకీ ఆడపిల్లలపై పెరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను చూసి ఓ మహిళగా చాలా బాధపడేదాన్నని చెబుతోంది సౌమ్య. ప్రతి చోటా పోలీసులు అందుబాటులో ఉండలేరు కాబట్టి ఎవరికి వారే తమ బాధ్యత తీసుకోవాలంటూ మహిళలకు అవగాహన కల్పిస్తోంది. కేరళలో పుట్టిన సౌమ్య, తండ్రి మిలటరీ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేయడంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో చదువుకుంది. ఢిల్లీలో బయోటెక్నాలజీలో డిగ్రీ చేసింది. మార్కెటింగ్, ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ చేసి ఓ బ్యాంకులో ఉద్యోగాన్ని సంపాదించుకుంది. అందులో సంతృప్తి అనిపించలేదు. తల్లిదండ్రులు, తాను చదివిన పుస్తకాల ప్రభావంతో ప్రజా సేవ చేయాలనుకుంది. ఓ వైపు పనిచేస్తూనే మరో వైపు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమైంది. 2010 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా రెండేళ్లు శిక్షణ పూర్తి చేసుకుంది.

ఆ తర్వాత సిమ్లాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా చేరింది. 72 ఏళ్ల తరువాత అక్కడ తొలి మహిళా పోలీసు అధికారిణిగా సౌమ్య నియమితురాలవడం విశేషం. రెండేళ్లకు హిమాచల్‌ప్రదేశ్, సిర్‌మౌర్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టింది. పోలీసులంటే భయం పోతేనే సమస్యలు తగ్గే అవకాశం ఉందంటోంది. అప్పుడే ధైర్యంగా మహిళలు స్టేషన్‌కు వచ్చి తమ సమస్యల్ని చెప్పగలుగుతారని, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కచ్చితంగా ఉండాలని సూచిస్తోంది. అందుకనే మహిళల్లో చైతన్యం తేవాలనే ఉద్దేశంతోనే మహిళలకు ఆత్మరక్షణ కోసం చిల్లీ పెప్పర్ స్ప్రే తయారుచేయడం నేర్పిస్తోంది. తయారీ నేర్పించాక ఖాళీ సీసాలను అందించి, వాళ్లంతట వాళ్లే చేసుకునేలా చూస్తోంది. వాటిని ఏ సందర్భాల్లో ఉపయోగించాలో కూడా తెలియజేస్తోంది. ఇప్పటివరకూ హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల మహిళలకు దీని తయారీలో శిక్షణ ఇచ్చింది.

“ఒక గ్లాసులో రెండు చెంచాల చొప్పున కారం, మిరియాల పొడి, అరగ్లాసు రిఫైన్ ఆయిల్, 50 ఎం.ఎల్. నెయిల్‌పాలిష్ రిమూవర్ (ఎసిటోన్) వేసి చెంచాతో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి ఖాళీగా ఉన్న స్ప్రే సీసాలో మూడొంతులు నింపితే చాలు.”అంటూ హిమాచల్‌ప్రదేశ్‌లో స్వీయరక్షణపై మహిళలకు వినూత్నంగా అవగాహన కల్పిస్తోన్న సౌమ్య అధికారులకు ఆదర్శంగా నిలుస్తోంది.

Shimla gets her first lady SP after 72 years

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆత్మస్థైర్యంతో దాడులను ఎదుర్కోవచ్చు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.