వంట నేర్పించడం మా ప్రత్యేకత..

  వంట చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ కాఫీ కలపడం కూడా సరిగ్గా చేతకాని వారుంటారు. పోనీ అమ్మదగ్గర నేర్చుకుందామంటే, చదువుకో పో అంటూ ఆమె వంటగదిలోకే రానివ్వదు. పెళ్లయ్యాక వంట నేర్పేది కచ్చితంగా భర్తే. ఆమె అరకొర వంట తినలేక అతను తప్పక నేర్పిస్తాడు. ఇవన్నీ కాకుండా అసలు చెఫ్ దగ్గరే నేర్చుకుంటే ఎంత బాగుంటుంది అనుకునే వారి కోసం ఏర్పాటయిందే జూబ్లీహిల్స్‌లోని ఫూ కలినరీ స్టూడియో. మహిళా పారిశ్రామిక వేత్త శిల్పా […]

 

వంట చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ కాఫీ కలపడం కూడా సరిగ్గా చేతకాని వారుంటారు. పోనీ అమ్మదగ్గర నేర్చుకుందామంటే, చదువుకో పో అంటూ ఆమె వంటగదిలోకే రానివ్వదు. పెళ్లయ్యాక వంట నేర్పేది కచ్చితంగా భర్తే. ఆమె అరకొర వంట తినలేక అతను తప్పక నేర్పిస్తాడు. ఇవన్నీ కాకుండా అసలు చెఫ్ దగ్గరే నేర్చుకుంటే ఎంత బాగుంటుంది అనుకునే వారి కోసం ఏర్పాటయిందే జూబ్లీహిల్స్‌లోని ఫూ కలినరీ స్టూడియో.

మహిళా పారిశ్రామిక వేత్త శిల్పా డాట్లాకు వచ్చిన ఆలోచనే ఈ స్టూడియో. పోషకాహారాన్ని ఎలా వండాలి, ఏ వయసు వారికి ఎలాంటి ఆహారాన్ని వండి వడ్డించాలనే విషయాన్ని ఇక్కడ ప్రముఖ చెఫ్‌లు తరగతుల ద్వారా నేర్పిస్తారు. స్టవ్‌లు, ఓవెన్‌లు ఉంటే చాలు. సులభంగా రుచిగా ఎలా వంటచేయాలో, బేకింగ్ ఐటమ్స్‌ను ఎలా చేయాలో చెబుతారు. పాకశాస్త్ర నిపుణుల ఆధ్వర్యంలో ఈ క్లాసులు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శిల్పా మాట్లాడుతూ…ఈ స్టూడియోలో నేర్పించే వంటలన్నీ బేకింగ్ పద్ధతిలో ఉంటాయి. అందుకనే మా స్టూడియో ప్రారంభోత్సవానికి ప్రముఖ ఇండియన్ బేకింగ్ చెఫ్ రూహీ భీమానీని ఆహ్వానించాం. పార్టీ వేడుకలకు ఈ స్టూడియో సరైన వేదిక అంటోంది శిల్ప. సంప్రదాయ వంటలతోపాటు ఆధునిక వంటల్లో శిక్షణ ఇస్తారిక్కడ. రోజుకు నాలుగ్గంటలు తరగతులు చెప్తారు. వంటకాలు, బేకింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఇదొక మంచి వేదిక. అన్ని వయసులవారికీ ఇక్కడ ప్రవేశం ఉంటుంది. వేగన్ బేక్స్ ఇక్కడి ప్రత్యేకమంటోంది శిల్ప.

Shilpa Datla Cooking classes in Foo Culinary Studio

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: