సహసం…. బతికి బయటపడ్డాడు

అమరావతి: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో మేకల కాపరి మేకల మేత కోసం సుబాబుల్ చెట్టు ఎక్కి కొమ్మను కొడుతుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్థానికులు గుర్తించి క్రేన్ సహాయంతో అతడు కిందకు దించి కాపాడారు. కీసర గ్రామానికి చెందిన నన్నేబోయిన నరసింహారావు మేకలను మేపేవాడు. మేత కోసం చెట్టు పైకి ఎక్కి కొమ్మలను నరికి కిందకు వస్తుండగా కరెంట్ తీగలు తగలడంతో కొమ్మల మధ్య ఇరుక్కపోయాడు. గ్రామస్థులు గమనించి కరెంట్‌ను ఆఫ్ చేశారు. రామకృష్ణ, వెంకయ్య నిచ్చెనల సహాయంతో పైకి ఎక్కి పడకుండా మేకల కాపారిని పట్టుకున్నారు. టోల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు క్రేన్ సహాయంతో అతడిని కిందకు దించారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

 

Shepherd Injured with Current Shock in Krishna

The post సహసం…. బతికి బయటపడ్డాడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.