69 బాల్య వివాహాలను అడ్డుకున్న రాచకొండ పోలీసులు

CP-Mahesh-Bhagwat

 

హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 69 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్య వివాహాలు చేస్తే జరిగే అనర్థాల గురించి పోలీసులు ప్రజలకు వివరించారు. చదువుకునే వయస్సులో బాలికలకు వివాహం చేయవద్దని, వారు బడిలో ఉండాలని తెలిపారు. ముఖ్యంగా రూరల్, అర్బన్ ఏరియాల్లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని పోలీసులు చెప్పారు. బాలికలకు చిన్నప్పుడే వివాహం చేస్తే మెటర్నల్ డెత్‌లు సంభవిస్తున్నాయని వెల్లడించారు.

ప్రాథమిక విద్యా చట్టం 2010 ప్రకారం… బాల,బాలికలు పాఠశాలలో ఉండాలని తెలిపారు. బాల్య వివాహాలను అడ్డు కోవడంలో షీటీమ్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. బాల్య వివాహానికి వెడ్డింగ్ కార్డులు ప్రింట్ చేసిన వారు, పెద్దలు, సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. బాల్య వివాహాలపై డయల్ 100, వాట్సాప్ నంబర్ 9490617111కు ఫోన్ చేయాలని కోరారు.

షీటీమ్స్ అవగాహన…
బాల్య వివాహాలపై షీటీమ్స్ బృందాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని సిపి మహేష్ భగవత్ హెచ్చరించారు. బాలికలకు 18ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు వచ్చే వరకు వివాహం చేయవద్దని ఆయన పేర్కొన్నారు.

బాల్య వివాహాలు చేయవద్దు : సలీమ, షీటీమ్స్ ఎడిసిపి
తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్య వివాహాలు చేయవద్దని రాచకొండ షీటీమ్స్ ఎడిసిపి సలీమా కోరారు. బాల్య వివాహాల వల్ల బాలికలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. ఎక్కడైనా బాల్యవివాహం జరిగితే చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు ఫోన్ చేయాలని ఆమె ప్రజలను కోరారు.

She teams educated to people on child marriages

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 69 బాల్య వివాహాలను అడ్డుకున్న రాచకొండ పోలీసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.