జర భద్రం

  ఎండ మండుతుంది, వడదెబ్బ తీస్తుంది నేడు, రేపు వడగాడ్పులు, ఈదురు గాలులు, తేలిక వర్షాలు మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 30 నుంచి 40 కి.మీల) తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే […] The post జర భద్రం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎండ మండుతుంది, వడదెబ్బ తీస్తుంది
నేడు, రేపు వడగాడ్పులు, ఈదురు గాలులు, తేలిక వర్షాలు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 30 నుంచి 40 కి.మీల) తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రజలు బయట తిరగవద్దు
బుధవారం ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆదిలాబాద్, కొమురంభీం, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గాయి. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం 40.4 డిగ్రీలు, పెద్దపల్లి 42.9, జయశంకర్ భూపాలపల్లి 42.4, కరీంనగర్ 42.5, భద్రాద్రి కొత్తగూడెం 41.0, మహబూబాబాద్ 41.3, జగిత్యాల 43.5, సూర్యాపేట 41.3, వరంగల్ అర్భన్ 41.5, రాజన్న సిరిసిల్ల 42.2, మంచిర్యాల 42.3, నల్లగొండ 41.4, ఆదిలాబాద్ 41.8, ఖమ్మం 40.4, నిజామాబాద్ 42.5, కొమురం భీం ఆసిఫాబాద్ 42.2, కామారెడ్డి 41.4, మెదక్ 41.5, సిద్దిపేట 40.8, నారాయణపేట 41.7, సంగారెడ్డి 40.8, మేడ్చల్ మల్కాజిగిరి 41.3, హైదరాబాద్ 41.3, యాదాద్రి భువనగిరి 40.7, వనపర్తి 42.1, రంగారెడ్డి 40.5 డిగ్రీలుగా నమోదయ్యింది.

కోస్తా ఆంధ్రలో ఓ మోస్తరు వర్షాలు
కోస్తా ఆంధ్రలో రాగల మూడురోజులు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 30- నుంచి 40 కి.మీల) తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 30 నుంచి -40 కి.మీల) తో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Sharp rise in day temperatures in Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జర భద్రం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: