శుభాల శరన్నవరాత్రి

  దేవీ భాగవతంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అమ్మవారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. శక్తి స్వరూపిణి నుంచే సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులు ఉద్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు శరన్నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు పరమేశ్వరి తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు. మహిషాసుర సంహారం కోసం అమ్మవారి ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి ఒక్కో రూపంలో యుద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ రోజు […] The post శుభాల శరన్నవరాత్రి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేవీ భాగవతంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అమ్మవారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. శక్తి స్వరూపిణి నుంచే సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులు ఉద్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు శరన్నవరాత్రులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు పరమేశ్వరి తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు. మహిషాసుర సంహారం కోసం అమ్మవారి ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి ఒక్కో రూపంలో యుద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ రోజు అమ్మవారు లలితా దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఆమెకు అత్యంత ప్రీతికరమైన దద్దోజనాన్ని నైవేద్యంగా భక్తులు సమర్పిస్తారు.

అమ్మవారి నైవేద్యం

దద్దోజనం
కావలసినవి: బియ్యం 1/4 కిలో, పాలు 1/2 లీ, చిక్కటి పెరుగు 1/2 లీ, నూనె 1/2 కప్పు, నెయ్యి 1 స్పూన్, కొత్తమిర, కరివేపాకు చిన్న అల్లం ముక్క , పచ్చిమిర్చి పోపు సామాగ్రి, జీడిపప్పు 20, ఉప్పు, ఇంగువ ఎండుమిర్చి.
తయారి విధానం: ముందు బియ్యం కడిగి అన్నం వండి, కాస్త చల్లారాక కాచిన పాలు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి ఉంచాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తమిర, కోరిన అల్లం అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. స్టవ్‌పై మూకుడుంచి అందులో నూనె వేసి పోపు గింజలు వేసి ఎండుమిర్చి ఇంగువతో పాటు తరిగి వుంచినవన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలపాలి. కాస్త నేతిలో జీడి పప్పులు వేయించి అవి కూడా కలపాలి.

Sharan Navaratri Pooja Vidhanam in Telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శుభాల శరన్నవరాత్రి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: