అదేమైనా కొత్త ట్రక్కా అలా పూజ చేయడానికి!

ముంబయి: ఫ్రాన్స్ అందచేసిన రఫేల్ యుద్ధ విమానానికి నిమ్మకాయలు, మిరపకాయలతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శస్త్ర పూజ చేయడాన్ని ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ ఎద్దేవా చేశారు. గురువారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ. 59,000 కోట్ల రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని దేశ భద్రతా ప్రయోజనాల దృష్టా తాను స్వాగతిస్తానని, అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానంగా పరిగణించే రాఫేల్ యుద్ధ విమానానికి దిష్టి తాకకుండా రాజ్‌నాథ్ సింగ్ నిమ్మకాయలు, […] The post అదేమైనా కొత్త ట్రక్కా అలా పూజ చేయడానికి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ఫ్రాన్స్ అందచేసిన రఫేల్ యుద్ధ విమానానికి నిమ్మకాయలు, మిరపకాయలతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శస్త్ర పూజ చేయడాన్ని ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ ఎద్దేవా చేశారు. గురువారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ. 59,000 కోట్ల రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని దేశ భద్రతా ప్రయోజనాల దృష్టా తాను స్వాగతిస్తానని, అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానంగా పరిగణించే రాఫేల్ యుద్ధ విమానానికి దిష్టి తాకకుండా రాజ్‌నాథ్ సింగ్ నిమ్మకాయలు, మిరపకాయలు కట్టడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. అదేమైనా కొత్తగా కొన్న ట్రక్కా.. నిమ్మకాయలతో దిష్టి తీయడానికి అని ఆయన ప్రశ్నించారు.

కాగా, ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీతోసహా పలువురు అధికారులు పాల్గొన్న రాఫేల్ అందచేత కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ రాఫేల్‌పై ఓం అనే సంస్కృత పదాన్ని రాయడంతోపాటు దానిపై పుష్పాలతో నీళ్లు చల్లి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. ఆ తర్వాత రాఫేల్ చక్రాల కింద నిమ్మకాయలు పెట్టారు. కొత్త వాహనం కొనుగోలు చేసినపుడు చేసే పూజలు రాఫేల్‌కు చేయడంపై పలువురు ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేశారు. పలువురు కాంగ్రెస్ నాయకులు దీన్ని తమాషాగా అభివర్ణించారు.

Sharad Pawar Digs over Rafale Puja by Rajnath

The post అదేమైనా కొత్త ట్రక్కా అలా పూజ చేయడానికి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: