నటిపై లైంగిక వేధింపులు …బుల్లితెర నటుడు అరెస్టు

TV Actor Abhinavముంబయి : ఓ నటిని లైంగిక వేధింపులకు గురి చేసిన బుల్లితెర నటుడు అభినవ్ కోహ్లీని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని సమతా నగర్ పోలీసు స్టేషన్ లో బాధిత నటి ఫిర్యాదు చేయడంతో అభినవ్ ను అరెస్టు చేశారు. తనను దూషించడంతో పాటు అసభ్యకరంగా ఉన్న మహిళల ఫొటోలను తనకు పంపుతూ , తన కోరిక తీర్చాలని అభినవ్ తనను బలవంత పెట్టేవాడని సదరు బాధిత నటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో అభినవ్ పై ఐపిసి సెక్షన్ 354-ఎ, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Sexual Assault on Actress … TV Actor Arrested

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నటిపై లైంగిక వేధింపులు … బుల్లితెర నటుడు అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.