పోడు భూసర్వే

సమస్య శాశ్వత పరిష్కారానికి సిఎం ఆదేశాలు ? మన తెలంగాణ/హైదరాబాద్: గిరిజనులు, ఆదివాసీల మధ్య వివాదానికి కారణమైన పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వతం పరిష్కారం చూపాలని నిర్ణయించింది. త్వరలో మరోసారి భూముల సర్వే జరగనున్న నేపథ్యంలో దీనికి పూర్తి స్థాయిలో పరిష్కారం దొరుకుతుందని అధికారులు కూడా ఆశిస్తున్నారు. కొన్ని రోజులుగా అటవీ భూములకు సంబంధించి వివాదాలు నెలకొనడంతో రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే నిర్వహిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంది. […] The post పోడు భూసర్వే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
సమస్య శాశ్వత పరిష్కారానికి సిఎం ఆదేశాలు ?

మన తెలంగాణ/హైదరాబాద్: గిరిజనులు, ఆదివాసీల మధ్య వివాదానికి కారణమైన పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వతం పరిష్కారం చూపాలని నిర్ణయించింది. త్వరలో మరోసారి భూముల సర్వే జరగనున్న నేపథ్యంలో దీనికి పూర్తి స్థాయిలో పరిష్కారం దొరుకుతుందని అధికారులు కూడా ఆశిస్తున్నారు. కొన్ని రోజులుగా అటవీ భూములకు సంబంధించి వివాదాలు నెలకొనడంతో రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే నిర్వహిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంది. దీని తరువాత రాష్ట్రవ్యాప్తంగా జరపనున్న భూముల సర్వేతో పోడు భూముల వివాదానికి పుల్‌స్టాప్ పెట్టవచ్చన్న ఆలోచనల నేపథ్యంలో సిఎం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు పోడు భూములకు సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి ఒకసారి సమావేశం అయ్యారని, మరోసారి ఇదే విషయంపై సమావేశం కావాలని ఇరు శాఖల అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.

వివాదాల్లో 7 లక్షల ఎకరాల భూములు
ముఖ్యంగా రెవెన్యూ, అటవీ భూముల మధ్య ఉన్న సరిహద్దుల వలనే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, వీటి పరిష్కారానికి ఇరుశాఖల ఉన్నతాధికారులు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. 7 లక్ష ల ఎకరాలకు చెందిన వివాదాలు న్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జాయింట్ సర్వేకు శ్రీకారం చుట్టాలని కూడా ఇరుశాఖల అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. రెండు శాఖల అధికారులు సమన్వయంతో సర్వే చేసి హద్దులను నిర్ధారించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా రానున్న సిబ్బందితో కంపోజిషన్ ఆఫ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

93,639 మంది ఆదివాసీలకు పట్టాలు
దాదాపు 6 లక్షల ఎకరాల్లో గిరిజనులు, ఆదివాసీలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నట్టు అధికారుల లెక్కలు పేర్కొంటున్నాయి. ఈ భూముల్లో తమకు పట్టాలు ఇవ్వాలని షెడ్యూల్ తెగలు, ఇతర ఆదివాసీలు అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 కింద లక్షా 83 వేలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి సమర్పించారు. అలా దరఖాస్తు చేసిన వారిలో ఆదివాసీలతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. అయితే 93,639 మంది ఆదివాసీలకు 3,00,284 ఎకరాల భూములకు చెందిన అటవీ హక్కు పత్రాలిచ్చారు. ఇంకా 90 వేల మంది దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. కాగా అటవీ భూములపై గతంలో ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఆచరణలోకి తీసుకోలేదు.

ఉమ్మడి రాష్ట్రంలో జాయింట్ సర్వేకు ప్రయత్నాలు జరిగినా ప్రభుత్వం అలసత్వంతో మధ్యలో నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అటవీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులకు అనేక సమస్యలు పేరుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులపై కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే అటవీ భూములపై ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనలో సర్వే చేయాలని భావించింది. కానీ అవి రెవెన్యూ రికార్డులతో సరిపోలేదు. అందుకే మరోసారి రెండు శాఖలు సమన్వయంతో జాయింట్ సర్వే చేసి పోడు భూముల తగువును తీర్చాలని కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో పోడు వ్యవసాయ భూములకు సంబంధించి పట్టాలను జారీ చేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో అధికారులు త్వరతగతిన ఈ సమస్యను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు.

25 లక్షల ఎకరాల భూమి సర్వే చేయాల్సి ఉంది
రాష్ట్రంలో అటవీ భూములు 33 శాతం ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే దీనిపై రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భిన్నమైన వివరాలు నమోదయ్యాయి. అటవీ భూములకు చెందిన 41.75 లక్షల ఎకరాల్లో వివాదాలు లేకుండా పక్కాగా ఉండగా ఇంకా 25 లక్షల ఎకరాల భూమి సర్వే చేయాల్సి ఉంది. జయశంకర్ భూపాలపల్లి, నాగర్‌కర్నూల్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అటవీ భూములకు సంబంధించిన వివాదాలు ఎక్కువగా ఉన్నట్టు ఇరుశాఖల అధికారులు తేల్చారు. అధికారులు ఖాస్రా పహాణీ, సేత్వార్, పాత పహాణీ, ఆర్ ఓఆర్ పహాణీ, మ్యానువల్, వెబ్‌ల్యాండ్, 1బీ, గ్రామ పటంతో రికార్డులను సరిచూస్తూ భూ రికార్డుల్లో తప్పులను సరిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో భూమికి, రికార్డుకు మధ్య తేడా ఉంటే ఇద్దరు అనుభవదారుల పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేలా చేపట్టిన కార్యాచరణతో చాలా భూ వివాదాలు పరిష్కారమయ్యాయి. విఆర్‌ఓ వద్ద ఉన్న పహాణీ విస్తీర్ణాన్ని ఖాస్రా, సేత్వార్ విస్తీర్ణంతో సరిపోల్చడం మంచి ఫలితాలనిస్తోంది.

Settle podu lands problem through Land Surveying

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పోడు భూసర్వే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: