ఊగిసలాటలో మార్కెట్ సూచీలు

సెన్సెక్స్ 33 పాయింట్లు అప్, నిఫ్టీ 1 పాయింట్ డౌన్ ముంబై: వరుసగా లాభాలతో సాగుతూ రికార్డు స్థాయిలకు చేరిన స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఎఫ్ అండ్ ఒ ముగింపు కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు ఊగిసలాటకు లోనయ్యాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమై తీవ్ర ఊగిసలాట మధ్య స్వల్పలాభాలతో సరిపెట్టుకున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 36,947కు చేరి సరికొత్త గరిష్టాన్ని తాకగా, మరోవైపు నిఫ్టీ కూడా 11,157ను దాటింది. అయితే మార్కెట్ ముగిసే […]


సెన్సెక్స్ 33 పాయింట్లు అప్, నిఫ్టీ 1 పాయింట్ డౌన్
ముంబై: వరుసగా లాభాలతో సాగుతూ రికార్డు స్థాయిలకు చేరిన స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఎఫ్ అండ్ ఒ ముగింపు కారణంగా ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు ఊగిసలాటకు లోనయ్యాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమై తీవ్ర ఊగిసలాట మధ్య స్వల్పలాభాలతో సరిపెట్టుకున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 36,947కు చేరి సరికొత్త గరిష్టాన్ని తాకగా, మరోవైపు నిఫ్టీ కూడా 11,157ను దాటింది. అయితే మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో 36,858 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 1 పాయింట్ నష్టంతో 11,132 వద్ద స్థిరపడింది. బిఎస్‌ఇలో ట్రేడైన మొత్తం షేర్లలో 1362 లాభపడగా, 1275 నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా ఐబి హౌసింగ్ 4 శాతం లాభపడగా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బిఐ, యుపిఎల్, అదానీ పోర్ట్, టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి, ఒఎన్‌జిసి, ఇండస్‌ఇండ్, వేదాంతా 2 నుంచి -1 శాతం మధ్య పెరిగాయి. మరోవైపు ఎన్‌టిపిసి 4 శాతం పతనమవగా, లుపిన్, హెచ్‌సిఎల్ టెక్, అల్ట్రాటెక్, యాక్సిస్, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, హెచ్‌పీసీఎల్, ఐషర్, పవర్‌గ్రిడ్ 3 నుంచి -1.5 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీలో రియల్టీ, ఫార్మా, ఐటి, ఆటో రంగాలు నష్టపోగా, పిఎస్‌యు బ్యాంక్స్, మెటల్ లాభపడ్డాయి. మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ.104 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అలాగే దేశీ ఫండ్స్(ధఐఐలు) రూ. 514 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి.