ప్రమోటర్లు, ఇన్‌సైడర్లు షేర్ల కొనుగోలు చేయలేరు

Sensex

 

ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు నిషేధం : సెబీ నిర్ణయం

న్యూఢిల్లీ/ముంబై : ప్రమోటర్లు, ఇతర ఇన్‌సైడ్‌ర్లు ఏప్రి ల్ 1 నుండి జూన్ 30 వరకు తమ కంపెనీల వాటాలను కొనుగోలు చేయలేరు. ఎందుకంటే కంపెనీలకు ఈసారి త్రైమాసిక ఫలితాలను ప్రకటించడానికి అదనపు సమయం ఇచ్చారు. కరోనావైరస్ ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వాటాల ట్రేడింగ్‌లో నిర్ణీత సమయానికి మించి నిషేధం నుండి మినహాయించాలని ప్రమోటర్లు కోరారు. కానీ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వారి డిమాండ్‌ను తిరస్కరించింది.

స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీలకు మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించటానికి సెబీ జూన్ 30 వరకు సమయం పొడిగించింది. దీని ప్రకారం ఏప్రిల్ 1 నుండి ఫలితాలు ప్రకటించిన తర్వాత ప్రమోటర్లు తమ కంపెనీల వాటాలను 48 గంటలు ట్రేడ్ చేయలేరు. సంస్థ త్రైమాసిక, వార్షిక ఆర్థిక ఫలితాలకు ప్రమోటర్లు, ఇన్‌సైడర్లు ఎక్కువ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సెబీ తెలిపింది. కొన్ని పెద్ద కంపెనీల ఫలితాలు స్టాక్ ఎక్స్ఛేంజికి ముందే సోషల్ మీడియాలో లీక్ కావడంతో సెబీ గత ఏడాది త్రైమాసిక ఫలితాలపై నిబంధనలను కఠినతరం చేసింది.

సెన్సెక్స్ 1203 పాయింట్లు పతనం
మార్కెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. గురువారం కూడా మార్కెట్లు క్షీణించాయి. ప్రారంభం నుంచే సూచీలు నేల చూపులు చూశాయి. సెన్సెక్స్ 1203.18 పాయింట్లు (-4.08%) పడిపోయి 28265.31 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 343.95 పాయింట్లు (-4.00%) పడిపోయి 8253.80 వద్ద స్థిరపడింది.

 

Sensex sheds 1,203 points

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రమోటర్లు, ఇన్‌సైడర్లు షేర్ల కొనుగోలు చేయలేరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.