నాలుగు నెలల గరిష్ఠానికి..

Sensex rises 465 points to touch 4-month high

 

ఆర్‌ఐఎల్, హెచ్‌డిఎఫ్‌సి స్టాక్స్ కొనుగోళ్లతో మార్కెట్లు జంప్
465 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
10,750 పాయింట్ల మార్క్‌ను క్రాస్ చేసిన నిఫ్టీ

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మరింత ఉత్సాహంగా ఉన్నాయి. సోమవారం ప్రారంభం నుంచి సూచీలు లాభాలతోనే కొనసాగాయి. హెవీ వెయిట్ స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సిలలో కొనుగోళ్ల జోరుతో సూచీలు 1.5 శాతం లాభపడ్డాయి. మార్కెట్ ముగిసేసరి సెన్సెక్స్ 465 పాయింట్లు లాభంతో 36,487 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 10,750 పాయింట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. నిఫ్టీ 156.30 పాయింట్ల లాభంతో 10,763.65 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50లో 40 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. అదే సమయంలో సెన్సెక్స్ 30 నుండి 25 స్టాక్స్ లాభపడ్డాయి. మొత్తానికి మార్కెట్లు నాలుగు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి.

నిఫ్టీలో ప్రధానంగా మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి స్టాక్స్ లాభపడ్డాయి. మరోవైపు బజాజ్ ఆటో, గెయిల్, ఎయిర్‌టెల్, విప్రోలు నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ ఫార్మా మినహా అన్ని సూచీలు గ్రీన్‌మార్క్‌తో ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్ 1.59 శాతం, పిఎస్‌యు బ్యాంక్ 1.26 శాతం, రియాలిటీ ఇండెక్స్ 3.0 శాతం, నిఫ్టీ ఆటో 2.88 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.41 శాతం, ఐటి 1.17 శాతం, ప్రైవేట్ బ్యాంక్ 1.57 శాతం, మెటల్ 2.47 శాతం, ఎఫ్‌ఎంసిజి 0.39 శాతం, మీడియా 0.45 శాతం వద్ద లాభంతో ముగిశాయి.

చరిత్ర సృష్టించిన రిలయన్స్
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈ సంస్థ మార్కెట్ విలువ సోమవారం రూ.11.5 లక్షల కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ మార్క్ ను దాటిన తొలి దేశీయ కంపెనీగా చరి త్ర సృష్టించింది. సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ)లో ఆర్‌ఐఎల్ స్టాక్ 3.75 శాతం పెరిగి రూ.1,855కు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) షేరు విలువ పెరగడంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,47,729.40 కోట్లకు చేరింది. దేశంలోనే అత్యంత విలువైన సంస్థ అయిన ఆర్‌ఐఎల్ జూన్‌లోనే రూ.11 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను సాధించి, ఈ మైలురాయిని చేరుకుని దేశంలోనే మొట్టమొదటి సంస్థగా నిలిచింది.

Sensex rises 465 points to touch 4-month high

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post నాలుగు నెలల గరిష్ఠానికి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.