జోరందుకున్న మార్కెట్లు…

  234 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ముంబై : ఎట్టకేలకు స్టాక్‌మార్కెట్లు మంగళవారం జోష్‌తో ముగిశాయి. స్వల్ప ఒడిదొడుకులతో ప్రారంభమైనప్పటికీ తదుపరి ఉత్సాహంతో పరుగులు తీశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే అధిక భాగం మొగ్గు చూపడంతో చాలా రోజుల తర్వాత సెన్సెక్స్ డబుల్ సెంచరీ దాటింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 39,131 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 11,663 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,174 […] The post జోరందుకున్న మార్కెట్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

234 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

ముంబై : ఎట్టకేలకు స్టాక్‌మార్కెట్లు మంగళవారం జోష్‌తో ముగిశాయి. స్వల్ప ఒడిదొడుకులతో ప్రారంభమైనప్పటికీ తదుపరి ఉత్సాహంతో పరుగులు తీశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే అధిక భాగం మొగ్గు చూపడంతో చాలా రోజుల తర్వాత సెన్సెక్స్ డబుల్ సెంచరీ దాటింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 39,131 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 11,663 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,174 నుంచి- 38,845 పాయింట్ల మధ్య కదలాడింది.

ఎన్‌ఎస్‌ఇలో ప్రధానంగా రియల్టీ, ఫార్మా, పిఎస్‌యు బ్యాంక్స్, ఎఫ్‌ఎంసిజి 2 నుంచి -1 శాతం మధ్య పెరిగాయి. ఇక ఐటి 0.6 శాతం బలహీనపడింది. నిఫ్టీ దిగ్గజాలలో యస్ బ్యాంక్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్, ఎన్‌టిపిసి, బిపిసిఎల్, టైటన్, డాక్టర్ రెడ్డీస్, పవర్‌గ్రిడ్ 6 నుంచి -2 శాతం మధ్య లాభపడ్డాయి.

మరోవైపు టిసిఎస్, ఎంఅండ్‌ఎం, హెచ్‌సిఎల్ టెక్, కొటక్ బ్యాంక్, యుపిఎల్, బ్రిటానియా, హిందాల్కో వంటి షేర్లు క్షీణించాయి. బిఎస్‌ఇ మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 నుంచి -0.3 శాతం చొప్పున బలపడ్డాయి. మొత్తం షేర్లలో 1162 లాభపడగా, 1,299 షేర్లు నష్టాలతో ముగిశాయి. సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ.216 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ.592 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి.

Sensex gains 234 points

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జోరందుకున్న మార్కెట్లు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: