ప్యాకేజీ ఉత్సాహం

  మూడో రోజూ లాభాల్లో మార్కెట్లు 1411 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ న్యూఢిల్లీ: వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది. ఆర్థిక వ్యవస్థ పతనం, వ్యాపార అంతరాయానికి పరిష్కారంగా గురువారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటనలు చేశారు. దీంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంతో కొనుగోళ్లు జరిపారు. దీంతో సెన్సెక్స్ 1411 పాయింట్లు పెరిగి […] The post ప్యాకేజీ ఉత్సాహం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మూడో రోజూ లాభాల్లో మార్కెట్లు
1411 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

న్యూఢిల్లీ: వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టింది. ఆర్థిక వ్యవస్థ పతనం, వ్యాపార అంతరాయానికి పరిష్కారంగా గురువారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటనలు చేశారు. దీంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంతో కొనుగోళ్లు జరిపారు. దీంతో సెన్సెక్స్ 1411 పాయింట్లు పెరిగి 29,946 పాయింట్లు వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 323 పాయింట్లు పెరిగి 8,641 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఇలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రైవేట్ బ్యాంక్స్ 8.3 శాతం, రియల్టీ 7.3 శాతం చొప్పున పెరిగాయి.

ఈ బాటలో ఎఫ్‌ఎంసిజి, ఆటో, ఐటీ 5- నుంచి 2 శాతం మధ్య పుంజుకున్నాయి. ప్రధానంగా ఇండస్‌ఇండ్ భారీగా లాభపడగా, ఎల్‌అండ్‌టి, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్‌టెల్, హీరో మోటో, బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్‌ఫ్రాటెల్, కొటక్ బ్యాంక్ పెరిగాయి. మరోవైపు గెయిల్, హెచ్‌సిఎల్ టెక్, సన్ ఫార్మా, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆర్‌ఐఎల్, మారుతీ, అదానీ పోర్ట్ 3.3-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. బిఎస్‌ఎస్‌ఇలో మిడ్, స్మాల్ క్యాప్స్ 3.5 శాతం చొప్పున పెరిగాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1508 లాభపడగా, 769 షేర్లు నష్టపోయాయి. నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ. 1893 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 738 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి.

Sensex gains 1411 points on third day

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్యాకేజీ ఉత్సాహం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: