నిరాశపర్చిన ప్యాకేజీ

  భారీగా 1,069 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ అత్యధికంగా నష్టపోయిన బ్యాంకింగ్ షేర్లు 313 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. గతవారంలో ఐదు రోజులు ఐదు దశలుగా ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. డిమాండ్‌ను పెంచడానికి ఆర్థిక వ్యవస్థలోకి భారీగా ద్రవ్య లభ్యత ఇస్తారని ఇన్వెస్టర్లు ఆశించారు. కానీ వారి అంచనాలను మార్కెట్లు అందుకోలేకపోవడంతో సూచీలు కుప్పకూలాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,069 […] The post నిరాశపర్చిన ప్యాకేజీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారీగా 1,069 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
అత్యధికంగా నష్టపోయిన బ్యాంకింగ్ షేర్లు
313 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోయాయి. గతవారంలో ఐదు రోజులు ఐదు దశలుగా ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఇన్వెస్టర్లను నిరాశపర్చింది.

డిమాండ్‌ను పెంచడానికి ఆర్థిక వ్యవస్థలోకి భారీగా ద్రవ్య లభ్యత ఇస్తారని ఇన్వెస్టర్లు ఆశించారు. కానీ వారి అంచనాలను మార్కెట్లు అందుకోలేకపోవడంతో సూచీలు కుప్పకూలాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,069 పాయింట్లు (3.44 శాతం) నష్టపోయి 30028.98 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 314 పాయింట్లు (3.43 శాతం) కోల్పోయి 8,823 పాయింట్ల స్థాయిలో ముగిసింది. అయితే వొలటైల్ ఇండెక్స్ ఇండియా విక్స్ 7.58 శాతం పెరిగి 40 మార్క్‌ను చేరుకుంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ భారీగా 10 శాతం పతనమైంది. ఆ తర్వాత హెచ్‌డిఎఫ్‌సి, మారుతీ, యాక్సిస్ బ్యాంక్‌లు 7 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు ఐటి దిగ్గజం టిసిఎస్ 2 శాతం పెరిగింది.

హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు కూడా 5 నుంచి 6 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ బ్యాంక్ అత్యధికంగా 6.7 శాతం క్షీణించింది. మరోవైపు నిఫ్టీ ఐటి ఇండెక్స్ 0.9 శాతం పెరిగింది. ఇక బిఎస్‌ఇ మిడ్ క్యాప్ సూచీ 3.75 శాతం నష్టపోగా, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ సూచీ 2.9 శాతం డౌన్ అయింది. సంక్షోభంలో కూరుకుపోయిన విమానయాన రంగానికి ప్రభుత్వం ప్యాకేజీలో ఎలాంటి ఊరటనివ్వకపోవడంతో ఈ రంగానికి చెందిన షేర్లు మరింత డీలాపడ్డాయి.

ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్పైస్‌జెట్ షేర్లు దాదాపు 9.5 శాతం వరకు పడిపోయాయి. లాక్‌డౌన్‌ను పొడిగించడం వల్ల ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి నెలకొనడంతో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్‌బిఎఫ్‌సిలు), గృహ రుణ సంస్థ(హెచ్‌ఎఫ్‌సిలు) 12 శాతం వరకు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే మిశ్రమంగా కనిపించాయి. కమోడిటీలో బంగారం ధర పెరిగింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా డిమాండ్ తగ్గిన క్రూడ్ ఆయిల్‌ధర పుంజుకుంటోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర 5.7 శాతం పెరిగి బ్యారెల్‌కు 34.35 డాలర్లకు చేరింది. కాగా గోల్డ్‌మన్ సాచ్స్ భారత్ జిడిపి మరింత పడిపోనుందని అంచనా వేసింది.

Sensex falls 1,069 points as bank stocks bleed

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిరాశపర్చిన ప్యాకేజీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: