హెచ్చుతగ్గుల మధ్య ఆఖరికి లాభాలు

86 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇటీవల తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గురువారం భారీగా నష్టపోయిన సూచీలు శుక్రవారం స్వల్పంగా పుంజుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్లు పెరిగి 39,619 వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,871 వద్ద స్థిరపడింది. ఆర్‌బిఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించినప్పటికీ గురువారం మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మార్కెట్లు రోజులో అధిక శాతం నేలచూపులకే పరిమితమవ్వగా, ఆఖరి సమయంలో కోలుకుని […] The post హెచ్చుతగ్గుల మధ్య ఆఖరికి లాభాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
86 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇటీవల తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గురువారం భారీగా నష్టపోయిన సూచీలు శుక్రవారం స్వల్పంగా పుంజుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్లు పెరిగి 39,619 వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,871 వద్ద స్థిరపడింది. ఆర్‌బిఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించినప్పటికీ గురువారం మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మార్కెట్లు రోజులో అధిక శాతం నేలచూపులకే పరిమితమవ్వగా, ఆఖరి సమయంలో కోలుకుని లాభపడ్డాయి. సెన్సెక్స్ 39,703- నుంచి 39,279 పాయింట్ల మధ్య కదలాడింది.

ఎన్‌ఎస్‌ఇలో ఫార్మా, మెటల్, రియల్టీ, ఆటో బలహీనపడ్డాయి. ఐటి, ప్రైవేట్ బ్యాంక్స్ లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్, ఇన్‌ప్రాటెల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బిఐ, బిపిసిఎల్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ, విప్రో, ఎం అండ్ ఎం, హెచ్‌డిఎఫ్‌సి ఎగశాయి. డాక్టర్ రెడ్డీస్, యస్ బ్యాంక్, సిప్లా, పవర్‌గ్రిడ్, జెఎస్‌డబ్లు స్టీల్, కోల్ ఇండియా, ఎన్‌టిపిసి, గెయిల్, సన్ ఫార్మా, ఆర్‌ఐఎల్, ఒఎన్‌జిసి క్షీణించాయి. బిఎస్‌ఇ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.15 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,410 నష్టపోగా, 1,061 షేర్లు మాత్రమే లభాలతో నిలిచాయి. గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ. 1449 కోట్లు, దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 651 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.

Sensex ends 86 points up

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హెచ్చుతగ్గుల మధ్య ఆఖరికి లాభాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: