నాలుగో రోజూ అదే తీరు

  ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశాలు కనిపించడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. స్వల్ప ఊగిసలాటతో ప్రారంభమైన మార్కెట్లలో మిడ్‌సెషన్‌కు ముందే అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో రోజంతా నష్టాల మధ్యే మార్కెట్లు కదిలాయి. చివరికి సెన్సెక్స్ 173.78 పాయింట్లు నష్టపోయి 38557.04 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 11498.90 వద్ద స్థిరపడింది. ప్రైవేటు బ్యాంకుల […] The post నాలుగో రోజూ అదే తీరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశాలు కనిపించడంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. స్వల్ప ఊగిసలాటతో ప్రారంభమైన మార్కెట్లలో మిడ్‌సెషన్‌కు ముందే అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో రోజంతా నష్టాల మధ్యే మార్కెట్లు కదిలాయి. చివరికి సెన్సెక్స్ 173.78 పాయింట్లు నష్టపోయి 38557.04 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 11498.90 వద్ద స్థిరపడింది. ప్రైవేటు బ్యాంకుల సూచీ తప్ప మిగిలిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. పిఎస్‌యు బ్యాంక్ సూచీ, రియాల్టీ కౌంటర్లు 1.5 శాతం నష్టపోయాయి.

నిఫ్టీలో ప్రధానంగా బజాజ్ ఫిన్‌కార్ప్, టాటా స్టీల్, టాటా మోటార్స్ అత్యధికంగా నష్టపోయాయి. మరోవైపు యస్‌బ్యాంక్, సన్‌ఫార్మా, ఐసిఐసిఐ బ్యాంక్ అత్యధికంగా లాభపడ్డాయి. ప్రమోటర్ల మధ్య విభేదాలతో ఇండిగో షేర్లు దాదాపు 17.54 శాతం నష్టపోయాయి. మన్‌పసంద్ బేవరేజస్ సంస్థ షేర్లు 5శాతానికి పైగా పడటంతో లోయర్ సర్క్యూట్ విధించారు. క్యూ1 ఫలితాలు వెల్లడించిన టిసిఎస్ షేరు 2.9 శాతం పతనమైంది. బిఎస్‌ఇ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.75 శాతం చొప్పున డౌన్ అయ్యాయి. మొత్తం షేర్లలో 1495 నష్టపోగా, 947 షేర్లు మాత్రమే లాభాలతో ముగిశాయి. మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ.674 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ.711 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.

Sensex ends 174 points lower dragged

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నాలుగో రోజూ అదే తీరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: