నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్

  కొనుగోళ్ల జోరుతో దూసుకెళ్లిన సూచీలు 1,627 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ముంబై: వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వారాంత శుక్రవారం స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్టాక్ మార్కెట్ చాలా హెచ్చు తగ్గులు చూసింది. అయినప్పటికీ ఆఖరికి లాభాలతో ముగిసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1627.73 పాయింట్లు పెరిగి 29,915.96 పాయింట్లకు చేరింది. ఇక నిఫ్టీ 482.00 పాయింట్లు పెరిగి 8,749.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. […] The post నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కొనుగోళ్ల జోరుతో దూసుకెళ్లిన సూచీలు
1,627 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

ముంబై: వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వారాంత శుక్రవారం స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్టాక్ మార్కెట్ చాలా హెచ్చు తగ్గులు చూసింది. అయినప్పటికీ ఆఖరికి లాభాలతో ముగిసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1627.73 పాయింట్లు పెరిగి 29,915.96 పాయింట్లకు చేరింది. ఇక నిఫ్టీ 482.00 పాయింట్లు పెరిగి 8,749.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 2130 పాయింట్లు పెరిగి 30,418.20 వద్దకు చేరుకుంది.

నిఫ్టీ కూడా 619 పాయింట్లు పెరిగి 8,883 వద్దకు చేరుకుంది. భారతదేశం జిడిపి వృద్ధి అంచనాను ఫిచ్ తగ్గించింది. రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ భారత జిడిపి వృద్ధి అంచనాను 5.6 శాతం నుండి 5.1 శాతానికి కోత పెట్టింది. కరోనావైరస్ ప్రభావం పెరుగుతున్నందున అంచనాలను తగ్గించింది. కరోనావైరస్ ఎక్కువగా ప్రభావితమైన మహారాష్ట్రలోని నగరాలు ముంబై, పూణే, నాగ్‌పూర్ లాక్ చేశారు. అయినప్పటికీ అవసరమైన వస్తువులు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు కూడా కొనసాగుతాయి.

నాలుగు రోజులుగా నష్టాలో..
ఈ వారం నాలుగు రోజులుగా మార్కెట్ నష్టాల్లో ఉంది. గురువారం సెన్సెక్స్ 581.28 పాయింట్లు తగ్గి 28,288.23 వద్ద, నిఫ్టీ 205.35 పాయింట్లు తగ్గి 8,263.45 వద్ద ఉంది. యుఎస్ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. డౌజోన్స్ 0.95%, ఎస్ అండ్ పి 0.47%, నాస్డాక్ 2.30% లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో కూడా లాభాలు వచ్చాయి. హాంకాంగ్ మార్కెట్ 2.94%, చైనా మార్కెట్ 0.47% పెరిగింది.

రూపాయి 8 పైసలు పతనం
డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా సానుకూలంగా ప్రారంభమైంది. ట్రేడింగ్‌లో రూపాయి 34 పైసలు పెరిగి 74.78 కు చేరుకుంది. అయితే ఇది 8 పైసలు కోల్పోయి 75.20 వద్ద ముగిసింది. గురువారం ఇది 86 పైసలు పడిపోయి 75.12 కనిష్ట స్థాయికి చేరుకుంది.

కరోనా ప్రభావాన్ని అంచనా వేసేందుకు టాస్క్ ఫోర్స్
దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనావైరస్ ప్రభావాన్ని అంచనా వేయడానికి, అవసరమైన సూచనలు చేయడానికి ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీనికి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షత వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రాత్రి దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ ప్రకటన చేశారు.

మార్కెట్ వృద్ధికి 4 కారణాలు
1. గత నాలుగు రోజులుగా మార్కెట్లు క్షీణించడంతో షేర్ల ధరలు దిగివచ్చాయి. దీంతో పెట్టుబడిదారులు దిగువ స్థాయి నుండి కొనుగోళ్లు చేపట్టారు.
2. ప్రపంచంలోని ప్రధాన దేశాలు కరోనావైరస్ బారిన పడిన వ్యాపారాలకు ఉపశమనం కలిగించడానికి మరిన్ని సహాయక చర్యలను పరిశీలిస్తున్నాయి. ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా విలువైన ప్యాకేజీ దిశగా అమెరికా చర్చిస్తోంది.
3. అమెరికాతో సహా ప్రధాన ఆసియా మార్కెట్లు ఊపందుకున్నాయి. ఇది భారత మార్కెట్లో సెంటిమెంట్‌ను కూడా మెరుగుపరిచింది.
4. ముడి చమురు ధరలు రెండు రోజులుగా పెరుగున్నాయి. దీంతో ఇంధన రంగంలోని కంపెనీలు పెద్దగా నష్టపోవనే ఆశలు చిగురించాయి.

కంపెనీలు పుంజుకున్నాయి..
బిఎస్‌ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్ 116 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.
మొత్తం 2,605 కంపెనీల ట్రేడింగ్‌లో 1,447 కంపెనీలు లాభపడగా, 1,008 కంపెనీలు నష్టపోయాయి.
19 కంపెనీల షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలో, 587 స్టాక్స్ ఏడాది కనిష్ట స్థాయిలో ఉన్నాయి
173 కంపెనీలలో అప్పర్ సర్క్యూట్, 377 కంపెనీలలో లోయర్ సర్క్యూట్
ఫార్మా స్టాక్స్ 16 శాతం పెరిగాయి. కాడిలా హెల్త్‌కేర్ 16.19%, డాక్టర్ రెడ్డీస్ 10.50%, సన్ ఫార్మా 1.55%, బయోకాన్ 8,83% జంప్ చేశాయి.

Sensex ends 1,627 points higher

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: