వారం మొత్తం నష్టాలే..

  ముంబై: కారణాలు ఏమైతేనేమీ ఈ వారం మొత్తం మార్కెట్లు నష్టాలనే మిగిల్చాయి. అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి, రూపాయి విలువ పతనం, దేశీయంగా కీలక రంగాల షేర్లు పడిపోవడం వెరసి మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. చివరి రోజైన శుక్రవారం కూడా సూచీలు నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ దాదాపు 96 పాయింట్లు పతనమైంది. మరోవైపు నిఫ్టీ 11,300 మార్క్‌ను కోల్పోయింది. ప్రారంభంలో లాభాల్లో కన్పించినప్పటికీ ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. […] The post వారం మొత్తం నష్టాలే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబై: కారణాలు ఏమైతేనేమీ ఈ వారం మొత్తం మార్కెట్లు నష్టాలనే మిగిల్చాయి. అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి, రూపాయి విలువ పతనం, దేశీయంగా కీలక రంగాల షేర్లు పడిపోవడం వెరసి మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. చివరి రోజైన శుక్రవారం కూడా సూచీలు నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ దాదాపు 96 పాయింట్లు పతనమైంది. మరోవైపు నిఫ్టీ 11,300 మార్క్‌ను కోల్పోయింది. ప్రారంభంలో లాభాల్లో కన్పించినప్పటికీ ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్‌తో పాటు బ్యాంకింగ్, లోహ, ఐటి, ఫార్మా, ఎనర్జీ, ఆటోమొబైల్ రంగాల షేర్లు కుదేలవడంతో ఒత్తిడికి గురైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. సెన్సెక్స్ 96 పాయింట్లు నష్టంతో 37,463 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 11,279 వద్ద స్థిరపడింది. ప్రధానంగా టాటాస్టీల్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, యస్‌బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు నష్టపోయాయి. ఎస్‌బిఐ, ఎయిర్‌టెల్, టైటాన్, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్ తదితర షేర్లు లాభాలను నమోదు చేశాయి.

Sensex declined 96 points to end at 37,463

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వారం మొత్తం నష్టాలే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: