వరుసగా రెండో రోజు కుప్పకూలిన మార్కెట్లు…

ముంబయి: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.73కు పడిపోయింది.  అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత పేరుగుతుందనే భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాల తెగబడ్డారు. ఈ క్రమంలో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 509 పాయింట్లు పతనమై 37,413కు పడిపోయింది. నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 11,287కు దిగజారింది. మార్చి 16 తర్వాత ఒక్క రోజులో ఈ స్థాయిలో సెన్సెక్స్ పతనమవడం […]

ముంబయి: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.73కు పడిపోయింది.  అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత పేరుగుతుందనే భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాల తెగబడ్డారు. ఈ క్రమంలో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 509 పాయింట్లు పతనమై 37,413కు పడిపోయింది. నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 11,287కు దిగజారింది. మార్చి 16 తర్వాత ఒక్క రోజులో ఈ స్థాయిలో సెన్సెక్స్ పతనమవడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.

రెడింగ్టన్ ఇండియా 5.80%, వరుణ్ బెవరేజెస్ 4.77%, క్వాలిటీ 4.77%, కార్బోరండమ్ యూనివర్సల్ లిమిటెడ్ 3.63%, ఫైజర్ 2.82%, బిఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ ఉన్నాయి.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ -8.20%, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ -6.82%, స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ -6.81%, ఎన్ఐఐటి టెక్నాలజీస్ -6.00%, గేట్ వే డిస్ట్రిపార్క్స్ -5.73%, టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇక కోటక్ బ్యాంక్, టిసిఎస్, అదానీ పోర్ట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐటిసి, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు 2 నుంచి 3.5 శాతం వరకు నష్టపోయాయి.

Related Stories: