తీవ్ర హెచ్చుతగ్గులు

Sensex

 

సెన్సెక్స్ 8 పాయింట్లు అప్.. నిఫ్టీ 8 పాయింట్లు డౌన్

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 8 పాయింట్లు స్వల్ప లాభంతో 40,802 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 8 పాయింట్లు నష్టపోయి 12,048 వద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే ఒక్క మెటల్ మాత్రమే లాభపడగా, మిగతా అన్ని రంగాల షేర్లు నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా ఆటో రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురైంది. బ్యాంకింగ్ రంగ షేర్ల క్షీణతతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 75 పాయింట్లు నష్టపోయి 32వేల దిగువన 31,871 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 280 పాయింట్ల లాభంతో 41,073 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు పెరిగి 12,137 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

గతవారంలో కేంద్రం విడుదల చేసిన రెండో త్రైమాసికంలో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి గణాంకాలు 6 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. అలాగే నవంబర్ నెల వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక అంతర్జాతీయం గా ముడిచమురు ధరల రికవరి, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి నిలకడగా ఉండడం తదితర అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫలితంగా సూచీలు ప్రారంభ లాభాల్ని కోల్పోయాయి. మిడ్‌సెషన్‌లో పరిమితి శ్రేణిలో కదలాడిన సూచీలు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. ప్రధానంగా ఒఎన్‌జిసి, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్, ఐషర్ మోటర్స్, యస్‌బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఏసియన్ పేయింట్స్, గ్రాసిం, రిలయన్స్ ఇండస్ట్రీస్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

Sensex closes 8.36 points higher at 40,802

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తీవ్ర హెచ్చుతగ్గులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.