ఆగని నష్టాలు

230 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ముంబై: అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదం ట్రంప్ ట్వీట్‌తో మరింత ముదరడంతో అంతర్జాతీయంగా మార్కెట్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రభావం దేశీయంగానూ కొనసాతోంది. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోననే ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. దీంతో వారు జాగ్రత్త వహిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సూచీలు వరుసగా నాలుగో రోజు నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్లు నష్టపోయి 37,558 వద్ద ముగిసింది. ఇక […] The post ఆగని నష్టాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

230 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

ముంబై: అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదం ట్రంప్ ట్వీట్‌తో మరింత ముదరడంతో అంతర్జాతీయంగా మార్కెట్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రభావం దేశీయంగానూ కొనసాతోంది. ఇదే సమయంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోననే ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. దీంతో వారు జాగ్రత్త వహిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సూచీలు వరుసగా నాలుగో రోజు నష్టాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్లు నష్టపోయి 37,558 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 57 పాయింట్లు నష్టపోయి 11,301 పాయింట్ల వద్ద స్థిరపడింది. రిలయన్స్, టాటామోటార్స్, ఎన్‌టిపిసి, హెసిఎల్ టెక్, పవర్ గ్రిడ్ వంటి భారీ షేర్లు నష్టంతో సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఫార్మా, లోహ సూచీలే భారీగా నష్టపోయాయి. యస్‌బ్యాంక్ షేర్లు 2.5 శాతం పతనం అయ్యాయి. అమెరికా అధ్యక్షుడి హెచ్చరికల నేపథ్యంలో యూఎస్-, చైనా చర్చలు విజయవంతం కావడం కష్టమేననే భయాలు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా బలహీనపడుతున్న మీడియా కౌంటర్లలో జి ఎంటర్‌టైన్, డిష్ టివి, జీ మీడియా 7 నుంచి -5 శాతం మధ్య పెరిగాయి. ఆర్‌ఐఎల్, ఎన్‌టిపిసి, బిపిసిఎల్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్, ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌సిఎల్ టెక్, సన్ ఫార్మా, పవర్‌గ్రిడ్ నష్టపోయాయి.

Sensex closes 230 pts down, Nifty at 11,301

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆగని నష్టాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: