ఆర్థికంగా ప్రేరేపిత సైబర్ దాడులు పెరిగాయి

  అత్యధికంగా టార్గెట్ అవుతున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వెరిజోన్ నివేదిక హైదరాబాద్: సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై సైబర్ దాడులు 12 రెట్లు ఎక్కువగా ఉన్నాయని, అలాగే పరిశ్రమల్లో ఆర్థికంగా ప్రేరేపించే సైబర్‌దాడులు ఎక్కువయ్యాయని మేనేజ్డ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ వెరిజోన్ నివేదిక పేర్కొంది. బుధవారం నాడు 12వ డిబిఐఆర్(డేటా ఉల్లంఘన పరిశోధన నివేదిక) ఎడిషన్‌ను వెరిజోన్ ఆవిష్కరించింది. 80కి పైగా దేశాల నుంచి సమాచార అంశాలను అందుకున్న నివేదికలో భారత్ నుంచి ఏకైన సభ్యుడిగా తెలంగాణ ప్రభుత్వం ఉంది. […] The post ఆర్థికంగా ప్రేరేపిత సైబర్ దాడులు పెరిగాయి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అత్యధికంగా టార్గెట్ అవుతున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
వెరిజోన్ నివేదిక

హైదరాబాద్: సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై సైబర్ దాడులు 12 రెట్లు ఎక్కువగా ఉన్నాయని, అలాగే పరిశ్రమల్లో ఆర్థికంగా ప్రేరేపించే సైబర్‌దాడులు ఎక్కువయ్యాయని మేనేజ్డ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కంపెనీ వెరిజోన్ నివేదిక పేర్కొంది. బుధవారం నాడు 12వ డిబిఐఆర్(డేటా ఉల్లంఘన పరిశోధన నివేదిక) ఎడిషన్‌ను వెరిజోన్ ఆవిష్కరించింది. 80కి పైగా దేశాల నుంచి సమాచార అంశాలను అందుకున్న నివేదికలో భారత్ నుంచి ఏకైన సభ్యుడిగా తెలంగాణ ప్రభుత్వం ఉంది. డిబిఐఆర్‌లో పాల్గొనే ఏకైన భారతీయ రాష్ట్రంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వంతో వెరిజోన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్ హాజరై ప్రసంగించారు. దేశంలో జీవనానికి అత్యంత అనుకూలైన నగరం హైదరాబాద్ అని అన్నారు. సమాచార ఉల్లంఘనలపై అందరిలో అవగాహన ఉండాలని అన్నారు. వెరిజోన్ సీనియర్ రిస్క్ అనలిస్ట్ డేవ్ హైలెండర్ మాట్లాడుతూ, జాతీయ, రాష్ట్రాల నటులకు సంబంధించిన ఉల్లంఘనలు ఎక్కువగా ఉండడం గమనార్హమని అన్నారు.

సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు సోషల్ ఇన్సిడెంట్లకు 12 రెట్లు ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నారు. గతంతో పోల్చితే వారిపై సామాజిక ఉల్లంఘనలు 9 రెట్లు అధికంగా ఉన్నట్టు తేలింది. సి-స్థాయి ఎగ్జిక్యూటివులను అధికంగా టార్గెట్ అవుతున్నారు. వీటిలో ఆర్థికపరమైన వ్యవహారాలే ఎక్కువగా ఉన్నాయి. దొంగిలించిన పత్రాలు ఉపయోగిస్తూ వెబ్ ఆధారిత ఈమెయిల్ ఖాతాల్లో చొరబడటంలో పెరుగుదల 98 శాతంగా ఉంది. అలాంటి దాడుల్లో 60 శాతం వెబ్ అప్లికేషన్ హ్యాక్ చేసినట్టు గుర్తించారు. అన్ని ఉల్లంఘనల్లో పావు శాతం గుఢాచర్యానికి సంబంధించినవి ఉన్నాయి. రాన్ సమ్ వేర్ దాడులు మరింత బలపడుతున్నాయి. విశ్లేషించిన మాల్వేర్ ఘటనల్లో 24 శాతం అవే. 86 దేశాలకు చెందిన 41,686 సెక్యూరిటీ ఘటనల విశ్లేషణలో 2,013 ఉల్లంఘనలు జరిగినట్టు నిర్థారించారు.

Senior executives 12 times more prone to cyber security

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆర్థికంగా ప్రేరేపిత సైబర్ దాడులు పెరిగాయి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: