న్యూఢిల్లీలో ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ వైరస్‌తో మృతి

Senior AIIMS doctor dies due to Covid-19  in Delhi

 

న్యూఢిల్లీ : ప్రముఖ పల్మనాలజిస్టు, ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ జితేంద్రనాధ్ పాండే కరోనా వైరస్‌తో శనివారం మృతి చెందారు.

ఆయన వయస్సు 78 ఏళ్లు. కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆయనకు,ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దాంతో మంగళవారం నుంచి వారిని ఇంటివద్దనే ఐసొలేషన్‌లో ఉంచారు. కోలుకున్నట్టు కనిపించినా శనివారం రాత్రి భోజనం చేసిన తరువాత నిద్ర లోనే ఆయన చనిపోయారని ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ రత్నద్వీప్ గులేరియా చెప్పారు. నిద్ర లోనే ఆయనకు గుండెపోటు వచ్చి ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, అపోలో గ్రూప్ జెఎండి డాక్టర్ సంగీతారెడ్డి సహా పలువురు ఆయన మృతికి సంతాపం వెలిబుచ్చారు.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post న్యూఢిల్లీలో ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ వైరస్‌తో మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.