విద్యుత్ శాఖలో.. ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించ వద్దు

  పరీక్షల నిర్వహణ పారదర్శకంగా ఉంటుంది ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక టిఎస్‌ఎస్‌పిడీసీఎల్ విజిలెన్స్ అధికారి మురళీధర్ రావు హైదరాబాద్ : విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్‌ఎస్‌పిడీసీఎల్) నిర్వహిస్తున్న పరీక్షలు పారదర్శకంగానే ఉంటాయని, ప్రతిభ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, నిరుద్యోగులు ఎవరూ దళారులు మాటలు నమ్మి మోస పోవద్దని విద్యుత్ శాఖ చీఫ్ విజిలెన్స్ అధికారి కె. మురళీధర్ రావు హ్చెచరించారు. సంస్థ్థ 2500 జూనియర్ లైన్‌మెన్, […] The post విద్యుత్ శాఖలో.. ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించ వద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పరీక్షల నిర్వహణ పారదర్శకంగా ఉంటుంది
ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక
టిఎస్‌ఎస్‌పిడీసీఎల్ విజిలెన్స్ అధికారి మురళీధర్ రావు

హైదరాబాద్ : విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్‌ఎస్‌పిడీసీఎల్) నిర్వహిస్తున్న పరీక్షలు పారదర్శకంగానే ఉంటాయని, ప్రతిభ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, నిరుద్యోగులు ఎవరూ దళారులు మాటలు నమ్మి మోస పోవద్దని విద్యుత్ శాఖ చీఫ్ విజిలెన్స్ అధికారి కె. మురళీధర్ రావు హ్చెచరించారు. సంస్థ్థ 2500 జూనియర్ లైన్‌మెన్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 29న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.

షెడ్యూల్ ప్రకారం వ్రాత పరీక్షలు నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకుంటోందని, సంస్థ చేపట్టిన పోస్టులను భర్తీకి వ్రాత పరీక్షలు అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగానే జరుగుతాయన్నారు. అయితే కొందరు దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు వసూలు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని సమాచారం తమకు వచ్చినట్లు చెప్పారు. గతంలో విద్యుత్ శాఖలో అదనపు ఏఈగా పని చేసి పదవి విరమణ పొందిన గోకుల్ శ్యామ్ సుందర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసిందన్నారు.

ఇతడు వ్రాత పరీక్షలో మార్కు వేయించి ఉద్యోగాలు వచ్చేటట్లు చేస్తామని చెప్పుకుంటూ కొంత మంది ఉద్యోగార్దుల నులంచి ఒకొక్క ఉద్యోగానికి మూడు లక్షలు మాట్లాడుకుని ముందుగా ఒక లక్ష రూపాయలు, ఉద్యోగం వచ్చిన తరువాత మిగతా రెండు లక్షలు ఇచ్చేటట్లు ఒప్పంద చేసుకున్నాడన్నారు. ఈ విషయంలో విజిలెన్స్ అధికారులు సైఫాబాద్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా గోకుల్ శ్యామ్‌పై పలు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

అతడిని విచారించగా కేవలం అభ్యర్థులు మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసుకున్న తరువాత అందులో ఎవరైనా స్వయం కృషితో ఉద్యోగం పొందితే ఆ ఉద్యోగం తానే ఇప్పించానని చెప్పి ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం తీసుకుని ఉద్యోగం రాని అభ్యర్థులకు అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తాడని తెలిసిందన్నారు. ఒక వేళ అభ్యర్థులు ఎవరైన దళారులను ఆశ్రయించినట్లు ముందుగా తెలిస్తే వారిని వ్రాత పరీక్షకు హజరు కానివ్వని హెచ్చరిస్తున్నారు.

ఒక వేళ ఉద్యోగం వచ్చిన తరువాత తెలిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైన దళారులు, ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్థులు సంప్రదించినట్ల్లయితే అట్టి సమచారాన్ని విజిలెన్స్ విభాగానికి ఫోన్ నెం ః 040..23431143, 9440813884, 9440812984 సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Selection for Jobs based on Talent

The post విద్యుత్ శాఖలో.. ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించ వద్దు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: